Kishan Reddy: కేసీఆర్‌ పాలనలో రైతులు గోస పడుతున్నారు

సీఎం కేసీఆర్‌పై ఎంపీ కిషన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవడంలో సీఎం విఫలమయ్యారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో రైతులు కేసీఆర్‌ను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు.

New Update
Kishan Reddy: కేసీఆర్‌ పాలనలో రైతులు గోస పడుతున్నారు

కేసీఆర్‌ పాలనలో వ్యవసాయం దండగగా మారిందని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ఆరోపించారు. ఖమ్మంలో జరిగిన రైతు గోస బీజేపీ భరోసా సభలో పాల్గొన్న ఆయన.. కేసీఆర్‌పై ఫైర్‌ అయ్యారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో విఫలమైందన్నారు. వర్షాల వల్ల రైతులు లక్షల ఎకరాల్లో పంట నష్టపోయారన్నారు. రైతులు లక్షల రూపాయలు అప్పుగా తెచ్చి వ్యవసాయం చేశారన్నారు. వరదలతో వారు వేసిన పంట పూర్తిగా నీటిపాలైందని కిషన్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పేరుకే రైతుల వద్దకు వెళ్లిన కేసీఆర్‌ వారిని ఇంతవరకూ ఆదుకోలేదని మండిపడ్డారు.

చేసిన అప్పులు తీరక, ప్రభుత్వం సబ్సిడీ క్రింద పురగుల మందులను అందిచలేకపోండంతో రాష్ట్రంలో 70 శాతం మంది రైతులు ఆత్మాహత్య చేసుకున్నారన్నారు. కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తాని కేసీఆర్‌ అన్నారని కిషన్ రెడ్డి తెలిపారు. వరదల వల్ల సీఎం అనుకున్న లక్ష్యం నెరవేరిందని ఎద్దేవా చేశారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులకు పావలా వడ్డీకి రుణాలు అందించలేకపోయిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. పంట బీమా అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ అంటే ఓ కుటంబ పార్టీగా మారిందని కిషన్‌ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతుల గురించి పట్టించుకోని సీఎం రాష్ట్రానికి అవసరమా అని ఎంపీ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే ఎంఐఎంకు వేసినట్లే అని కిషన్‌ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీతో కేసీఆర్‌ చీకటి ఒప్పందం చేసుకున్నారన్న ఆయన.. కాంగ్రెస్‌కు ఓటు వేసినా కేసీఆర్‌కు ఓటు వేసినట్లేనని సూచించారు. రాష్ట్రంలో రైతులు బాగుండాలంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని సూచించారు. కేసీఆర్‌ మోసాలను ప్రజల గమనిస్తున్నారన్న ఆయన.. కేసీఆర్‌కు ప్రజలే బుద్ది చెబుతారని పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు