Mahua Moitra : మహువా బహిష్కరణ వేటుపై దీదీ ఆగ్రహం.. ఏమన్నారంటే

టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాను పార్లమెంటు నుంచి బహిష్కరించడంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ స్పందించారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు జరిగిన ద్రోహమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో మమ్మల్ని ఓడించలేకే ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

New Update
Mahua Moitra : మహువా బహిష్కరణ వేటుపై దీదీ ఆగ్రహం.. ఏమన్నారంటే

Didi Angry About Mahua Moitra  : వ్యాపారవేత్త హిరానందని నుంచి డబ్బులు తీసుకొని పార్లమెంటులో ప్రశ్నలు అడిగారనే ఆరోపణలతో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా(Mahua Moitra) ను లోక్‌సభ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. మహువాను లోక్‌సభ నుంచి బహిష్కరించడాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థకు జరిగిన ద్రోహమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు తమ పార్టీ అండగా ఉంటుందని.. ఎన్నికల్లో మమ్మల్ని ఓడించలేకే ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. లోక్‌సభలో ఈ వ్యవహారంపై చర్చ జరిగినప్పుడు ఆమెను కనీసం మాట్లాడించేందుకు కూడా బీజేపీ అవకాశం ఇవ్వకపోవడం అన్యాయమంటూ ధ్వజమెత్తారు.

Also read: రేపటి నుంచే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం.. అవి ఉండాల్సిందే!

మెజార్టీలో తాము ఉన్నాము కాబట్టి ఏమైన చేయొచ్చని బీజేపీ(BJP) భావిస్తోందని.. కానీ వాళ్లు అధికారం దిగిపోయే రోజు వస్తుందని దీదీ విమర్శలు చేశారు. ఈ పోరాటంలో మహువా తప్పకుండా విజయం సాధిస్తుందని.. వచ్చే ఎన్నికల్లో ఆమె మరింత మెజార్టీతో పార్లమెంట్‌లో అడుగుపెడతారని వ్యాఖ్యానించారు. ఇదిలాఉండగా.. పార్లమెంటులో ప్రశ్నలు అడిగడానికి పారిశ్రామికవేత్త నుంచి మహువా డబ్బులు తీసుకున్నారని గతంలో బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ రూపొందించిన నివేదికను ఈరోజు (శుక్రవారం) లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ జరిగిన తర్వాత దీన్ని లోక్‌ సభ ఆమోదించింది. మహువా మొయిత్రా అనైతికంగా.. అమర్యాదగా ప్రవర్తించారంటూ ఆమెపై బహిష్కరణ వేటు పడింది.

Advertisment
తాజా కథనాలు