Health Tips : ఆ విషయంలో మాంసాహారుల కంటే శాఖాహారులకే తీవ్ర ముప్పు

మాంసాహారుల కంటే శాఖహారుల్లో ఎముకలు విరిగే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నిర్వహించిన పరిశోధనలో తేలింది. శాఖాహారం తినేందుకు అలావాటు పడినప్పటికీ శరీరంలో జరిగే మార్పులను ఎప్పటికప్పుడు గమనించుకోవాలని పరిశోధకులు సూచనలు చేస్తున్నారు.

Health Tips : ఆ విషయంలో మాంసాహారుల కంటే శాఖాహారులకే తీవ్ర ముప్పు
New Update

Veg - Non-Veg : సాధారణంగా మాంసాహారం(Non-Vegetarian) కంటే శాఖాహారం(Vegetarian) తినేవారే ఆరోగ్యంగా ఉంటారనే మాటలు మనం తరుచుగా వింటుంటాం. ఏవైన దీర్ఘకాలిక వ్యాధులకు గురైనప్పుడు కొందరు మొత్తం మాంసాహారాన్నే మానేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే శాఖాహారం తిన్నంత మాత్రనే వారు ఆరోగ్యం(Healthy) గా ఉంటారనే గ్యారెంటీ లేదు. మాంసాహారుల కంటే శాఖహారుల్లో ఎముకలు విరిగే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ(Oxford University) నిర్వహించిన పరిశోధనలో తేలింది.

Also Read : యూట్యూబ్‌.. భారత్‌కు చెందిన వీడియోలు ఎన్ని తొలగించందంటే

మాంసాహారాన్ని పూర్తిగా తినకపోవడం.. పాల ఉత్పత్తులను తీసుకోకపోవడం వల్ల శాఖాహారుల్లో బాడీమాస్ ఇండెక్స్(BMI) తగ్గుతుందని నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. అలాగే శాఖాహారుల్లో క్యాల్షియం పాళ్లు పడిపోవడం వల్ల ఎముకలు దెబ్బతినే ప్రమాదం ఎక్కులగా ఉంటుందని చెబుతున్నారు. మాంసాహారం తినేవారితో పోలిస్తే.. శాఖాహారుల్లోనే తుంటి ఎముక విరిగే ప్రమాదం రెండున్నర రేట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు.

అంతేకాదు. శరీరంలో ఎక్కడైన చిన్నచిన్న దెబ్బలు తగిలినా కూడా.. కాలు ఎముక విరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అయితే శాఖాహారం తినేందుకు అలావాటు పడినప్పటికీ కూడా.. శరీరంలో జరిగే మార్పులను ఎప్పటికప్పుడు గమనించుకోవాలని పరిశోధకులు సూచనలు చేస్తున్నారు.

Also Read : వేసవిలో ఇవి తింటే శరీరంలోని నీరంతా మాయం..జాగ్రత్త

#non-veg #vegetarian-and-non-vegetarian #vegetarian #telugu-news #health-tips #health-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి