YouTube : యూట్యూబ్.. భారత్కు చెందిన వీడియోలు ఎన్ని తొలగించందంటే గత ఏడాది అక్టోబర్ - డిసెంబర్ మధ్య సామాజిక మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు మన దేశానికి చెందిన 22.5 లక్షల వీడియోలను యూట్యూబ్ తొలగించింది. ఎక్కువ వీడియోలు తొలగించిన యూట్యూబ్ జాబితాలో భారత్ మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో సింగపూర్ ఉంది. By B Aravind 27 Mar 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి YouTube Videos Removed : స్మార్ట్ఫోన్లు(Smartphones) వాడే ప్రతి ఒక్కరు యూట్యూబ్ చూడకుండా ఉండలేరు. ఒక్కసారి అలా యూట్యూబ్ ఓపెన్ చేశారంటే.. ఇక అందులో వచ్చే వీడియోలు చూస్తూనే ఉండిపోతారు. మరికొందరైతే గంటల తరబడి అందులోనే ఉండిపోతారు. యూట్యాబ్లో ప్రతిరోజూ కూడా కోట్లాది వీడియోలు అప్లోడ్(Upload Videos) అవుతుంటాయి. అలాగే ఏవైనా నిబంధనలు ఉల్లంఘించిన వీడియోలు ఉంటే వాటిని యూట్యూబ్ తొలగిస్తుంది. అయితే గత ఏడాది అక్టోబర్ - డిసెంబర్ మధ్య సామాజిక మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు మన దేశానికి చెందిన 22.5 లక్షల వీడియోలను తొలగించింది. Also Read : పడవ ప్రమాదంలో బాధితులంతా భారతీయులే! ఇలా ఏవైనా రూల్స్ పాటించకుంటే వివిధ దేశాలకు చెందిన వీడియోలను యూట్యూబ్ తొలగిస్తుంది. ఎక్కువ వీడియోలు(Videos) తొలగించిన యూట్యూబ్(YouTube) జాబితాలో భారత్(India) మొదటి స్థానంలో ఉంది. ఇక రెండో స్థానంలో సింగపూర్ ఉంది. ఆ దేశానికి చెందిన 12.43 లక్షల వీడియోలను తొలగించి యూట్యూబ్. ఆ తర్వాత స్థానంలో అమెరికా (7.88 లక్షలు), ఇండోనేషియా (7.70 లక్షలు), రష్యా (5.16 లక్షలు) ఉన్నాయి. 2023లో ప్రపంచం మొత్తంగా చూసుకుంటే 90 లక్షలకు పైగా వీడియోలను యూట్యూబ్ తొలగించింది. ఈ వీడియోల్లో ప్రమాదకరమైన అంశాలు, పిల్లల భద్రత, అశ్లీల దృష్యాలు, ఫేక్ సమాచారం(Fake News), హింసాత్మక ఘటనలు.. ఇలాంటివాటిని యూట్యూబ్ తొలిగిస్తూ వస్తోంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా.. ఏకంగా 2.05 కోట్ల యూట్యూబ్ ఛానళ్లను కూడా గత ఏడాది అక్టోబర్ - డిసెంబర్ మధ్య యూట్యూబ్ తొలగించింది. 90 రోజుల గడువులో మాడుసార్లు ఏవైనా నిబంధనలు ఉల్లంఘించినా అలాగే తీవ్ర దుష్ప్రవర్తనకు పాల్పడినా.. ఆ ఛానళ్లను యూట్యూబ్ తొలగిస్తుంది. Also Read : సరిహద్దులను చెరిపేసిన ప్రేమ విడిపోయింది..బ్రేకప్ చెప్పుకున్న భారత్-పాక్ లెస్బియన్లు #youtube-videos #telugu-news #youtube మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి