Sweets: తిన్న తర్వాత స్వీట్లు తింటున్నారా?..వాటికి బదులు ఇవి తింటే గుండెకు చాలా మంచిది

ఆహారం తిన్న తర్వాత ఏదైనా స్వీట్లకు బదులు ఖర్చూరం తింటే గుండెతో పాటు ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరం తింటే ఎముకలు, గుండె, మధుమేహం, క్యాన్సర్‌ బారి నుంచి కాపాడుకోవచ్చు. దీనివల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా, మలబద్ధకం సమస్య దూరమవుతుందంటున్నారు.

Sweets: తిన్న తర్వాత స్వీట్లు తింటున్నారా?..వాటికి బదులు ఇవి తింటే గుండెకు చాలా మంచిది
New Update

Sweets: తరచుగా ఆహారం తిన్న తర్వాత ఏదైనా తీపి తినాలనే కోరిక ప్రతిఒక్కరికి ఉంటుంది. రాత్రి భోజనవం తర్వాత ఆరోగ్యకరమైన డెజర్ట్ తీసుకుంటూ ఉంటారు. అయితే స్వీట్లకు బదులు ఖర్చూరం తింటే గుండెతో పాటు ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరం తింటే ఎముకలు, గుండె, మధుమేహం, క్యాన్సర్‌ బారి నుంచి కాపాడుకోవచ్చు.

ఖర్జూరం ప్రయోజనాలు:

ఖర్చూరంలో సహజసిద్ధమైన చక్కెర ఉంటుంది. మధుమేహం ఉన్నవారు కూడా దీన్ని తీసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఖర్జూరం ఫ్రక్టోజ్‌ అద్భుతమైన మూలం. ఫ్రక్టోజ్ అనేది పండ్లలో కనిపించే చక్కెర పేరు. ఖర్జూరం చాలా తీపిగా ఉంటుంది. దీన్ని అనేక రకాల స్వీట్లలో చక్కెరకు బదులుగా వాడుతారు.

ఖర్జూరంలో పోషకాలు:

  • హెల్త్‌లైన్ నివేదిక ప్రకారం ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో పాటు అనేక విటమిన్లు, ఖనిజాలు ఖర్జూరంలో ఉంటాయి. 100 గ్రాముల ఖర్జూరంలో 75 గ్రాముల పిండి పదార్థాలు, 7 గ్రాముల ఫైబర్, 2 గ్రాముల ప్రోటీన్, 15శాతం పొటాషియం, 13శాతం మెగ్నీషియం, 40శాతం కాపర్, మాంగనీస్ 13శాతం, ఐరన్ 5శాతం, విటమిన్ B-6 15శాతం ఉంటాయి.

మలబద్ధకం నుంచి ఉపశమనం:

  • ఖర్జూరంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా మలబద్ధకం సమస్య దూరమవుతుంది. అలాగే కడుపుకూడా శుభ్రం అవుతుంది. ఆరోగ్య సమస్యలు ఉండవని నిపుణులు చెబుతున్నారు.

గుండెకు మేలు:

  • ఖర్జూరలో అనేక రకాల యాంటీ-ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. క్యాన్సర్, అల్జీమర్స్, మధుమేహం వృద్ధిని నిరోధించడంలో ఖర్జూరం సహాయపడుతుంది. అంతేకాకుండా ఖర్జూరాలు శక్తి స్థాయిని పెంచడంలో బాగా సహాయపడతాయి.

ఎముకలకు మేలు:

  • ఖర్జూరం ఎముకలకు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరంలో భాస్వరం, కాల్షియం, మెగ్నీషియం వంటి అనేక రకాల ఖనిజాలు ఉంటాయని అంటున్నారు.

బ్లడ్ షుగర్ కంట్రోల్:

  • బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయడంలో ఖర్జూరాలు బాగా పనిచేస్తాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్ల కారణంగా రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ఖర్జూరాలు ప్రభావవంతంగా ఉంటాయని, దీని వల్ల డయాబెటిక్ రోగులకు కూడా ఉపశమనం లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి : పెంపుడు కుక్కలకు వయసైపోయిందని ఎలా తెలుస్తుంది?..ఈ లక్షణాలు గమనించండి

గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#health-benefits #health-care #best-health-tips #dates #meals #heart #sweets
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe