Kota Student Missing: రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు ఆగడం లేదు. మరికొందరు అదృశ్యమవుతున్నారు. అయితే తాజాగా నీట్ శిక్షణ (NEET Coaching) కోసం వచ్చిన మరో విద్యార్థి కనిపించకుండా పోయాడు. అంతకుముందు ఆ విద్యార్థి తన తల్లిదండ్రులకు ఓ మెసేజ్ పంపాడు. దీన్ని చూసిన వారు ఆందోళనకు గురవుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని (Rajasthan) బమన్‌వాస్ అనే ప్రాంతానికి చెందిన రాజేంద్ర మీనా కోటాలో నీట్ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఇటీవల అతడు తన తండ్రి జగ్‌దీశ్ మీనాకు ఓ మెసేజ్ పెట్టాడు. అందులో 'నేను ఇంటికి రాను.. వెళ్లిపోతున్నాను. ఉన్నత చదువులు చదవాలని లేదు. ఇప్పుడు నా దగ్గర రూ.8వేలు ఉన్నాయి. ఐదేళ్లవరకు తిరిగిరాను. నా ఫోన్ అమ్మేస్తాను. ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోను.
Also Read: అదానీ, అంబానీపై ఈడీ విచారణ జరిపించండి.. మోదీకి ఎంపీ బినోయ్ విశ్వం లేఖ
నా గురించి అమ్మను బాధపడొద్దని చెప్పండి. మీ అందరి ఫోన్ నెంబర్లు నా దగ్గర ఉన్నాయి. ఏడాదికి ఒకసారి తప్పకుండా ఫోన్ చేస్తాను' అని రాజేంద్ర మీనా మెసేజ్ పెట్టాడు. ఇది చూసి ఆందోళనకు గురైన అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మే 6వ తేదీ నుంచి తమ కొడుకు కనిపించడం లేదని.. ఆరోజు మధ్యాహ్నం కోటాలో హాస్టల్ నుంచి వెళ్లిపోయాడని చెప్పారు. ప్రస్తుతం పోలీసులు ఆ విద్యార్థి కోసం గాలిస్తున్నారు. గత ఆదివారం నీట్ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. ఇక కోటాలో చదువులు ఒత్తిడి వల్ల విద్యార్థులు వరసగా ఆత్మహత్యలకు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా సూసైడ్‌లు మాత్రం ఆగడం లేదు.
Also Read: ఆగస్టు 15లోగా 30 లక్షల ఉద్యోగాలు.. రాహుల్ గాంధీ కీలక ప్రకటన