Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారీ షాక్ తగిలింది. 2024 అమెరికన్ ఎన్నికల్లో పాల్గొనాలని అనుకుంటున్న అతనికి న్యూయార్క్ కోర్టు (New York Court) ఝలక్ ఇచ్చింది.
ట్రంప్, అతని కుమారులు ఆర్ధిక నేరాలకు పాల్పడ్డారని తేల్చి చెప్పింది న్యూయార్క్ నాయస్థానం. ట్రంప్ తమ కంపెనీ ఆస్తులను ఎక్కువగా చూపిస్తూ పలు ఒప్పందాలు చేసుకోవడమే కాక అక్రమంగా అప్పులు కూడా తీసుకున్నారని న్యూయార్క్ జడ్జి ఆర్ధర్ ఎంగ్రోన్ (Judge Arthur Engoron) స్పష్టం చేశారు. తన ఆస్తుల విలువను డాక్యుమెంట్లలో భారీగా చూపించి బ్యాంకులు, బీమా సంస్థలను, ఇతరులను ట్రంప్ మోసం చేశారన్నారు.
అమెరికన్ వార్తా కథనాల ప్రకారం ట్రంప్ కు సంబంధించిన కొన్ని కంపెనీల లైసెన్స్ లను రద్దు చేయాలని జడ్జి ఆర్ధర్ ఆదేశించారు. ట్రంప్ కు, ఆయన వారసులకు 250 మిలియన్ డాలర్ల జరిమానా విధించాలని, న్యూయార్క్ లో ట్రంప్ వ్యాపారం చేయకుండా నిషేధించాలని న్యూయార్క్ అటారీ జరనల్ లెటిటియో జేమ్స్ కోరారు. అయితే ట్రంప్...తాను ఎలాంటి ఆర్ధిక నేరాలకు పాల్పడలేదని చెబుతున్నారు. విచారణకు ముందే ట్రంప్ మీద ఉన్న కేసులను కొట్టేయాలని అతని లాయర్లు న్యూయార్క్ జడ్జ్ ను కోరారు. కానీ కేసును విచారించిన జడ్జి ఆర్ధర్ ట్రంప్ మీద వచ్చిన ఆరోపణలు నిజమే అని నిర్ధారించారు.
అయితే అక్టోబర్ 2న నాన్ జ్యూరీ ట్రయల్ ని నిర్వహించి ట్రంప్ కు విధించే శిక్ష మీద నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఒకవేళ ట్రంప్ కు కనుక శిక్ష పడితే 2024 రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్ధిత్వానికి ఎసరు పడుతుంది. అదే కనుక జరిగితే భారత సంతతి వివేక రామస్వామికి రూట్ క్లియర్ అవుతుంది.
ఇవి కూడా చదవండి:వాళ్ళకు అసలు జీతాలే ఉండవట…లాభాల మీద కమీషన్ మాత్రమే ఇస్తారుట.
నయనానందం…పుట్టినరోజు నాడు పిల్లల ముఖాలు చూపించిన లేడీ సూపర్ స్టార్