Kishan Reddy: దిశా సమావేశానికి డుమ్మా కొడతారా.?

జీహెచ్‌ఎంసీ అధికారులపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫైరయ్యారు. అధికారులు ఫ్లై ఓవర్‌ ఇనాగరేషన్‌ పేరుతో దిశా సమావేశానికి డుమ్మా కొట్టారని మండిపడ్డారు. ఇదంతా కేసీఆర్‌ కావాలనే చేయిస్తున్నారని విమర్శించారు.

New Update
Kishan Reddy: దిశా సమావేశానికి డుమ్మా కొడతారా.?

Kishan Reddy Fires On GHMC Officials: జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలల క్రితమే నిర్ణయించిన దిశా మీటింగ్‌కు (Disha Meeting) అధికారులు రాకపోవడంపై ఆయన మండిపడ్డారు. దిశా మీటింగ్ ఉన్నా అధికారులు ఫ్లై ఓవర్‌ ఇనాగరేషన్‌ ఎలా పెట్టుకుంటారని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. రెండు రోజుల ముందు ఫ్లై ఓవర్ ఇనాగరేషన్‌ కార్యక్రమం పెట్టుకొని మూడు నెలల క్రిదం డేట్‌ ఫిక్స్‌ చేసుకున్న దిశా సమావేశానికి డుమ్మా కొడతారా అంటు తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. జీహెచ్‌ఎంసీ సహకరించకపోవడంతోనే ఆర్వోబి పనులు వాయిదా పడుతున్నాయని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌ కలెక్టర్‌, జీహెచ్‌ఎంసీ, రైల్వే సిబ్బంది కోఆర్డినేట్‌ చేసుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు.

మరోవైపు కిషన్‌ రెడ్డి బీఆర్‌ఎస్ ప్రభుత్వం (BRS Govt)పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదంతా సీఎం కేసీఆర్‌ కావాలనే చేయిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పనులకు ఇబ్బందులు కలిగించాలనే ఉద్దేశంతోనే తాము పెట్టుకున్న ముహుర్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే సమావేశానికి రాలేకపోతున్నారన్నారు. కేసీఆర్ రాజకీయ లబ్దికోసమే ఈ ఏడాది నగరంలో ఫ్లై ఓవర్లు ప్రారంభించారన్నారు.

కేసీఆర్‌ రాజకీయ కుట్రలను భట్టబయలు చేస్తామని కిషన్‌ రెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో గ్రామస్థాయిలో ప్రజల్లోకి వెళ్తామన్నారు. గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు సభలు నిర్వహిస్తామని, ఆ సభల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై ప్రజలకు వివరిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ పదేళ్లలో చేపట్టిన పథకాల గురించి తెలియజేస్తామన్నారు. కేసీఆర్‌ నియంతృత్వ పాలనను అంతమొందించడమే లక్ష్యంగా బీజేపీ శ్రేణులు పనిచేస్తున్నారని ఆయన వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు