Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ కిడ్నాప్ కేసులో కీలక పరిణామం..సీసీఫుటేజ్ విడుదల చేసిన టీడీపీ

కిడ్నాప్‌, దాడి కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా పోలీసులు బలమైన సాక్ష్యాలు సేకరిస్తున్నారు. సాంకేతిక ఆధారాలన్నీ పక్కాగా తీసుకుంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌ రాయదుర్గంలో వంశీ నివసిస్తున్న ఇంటి వద్ద సీసీ కెమెరాల్లో ఫుటేజీని తీసుకున్నారు.

New Update
Vallabhaneni Vamsi |

Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi : కిడ్నాప్‌, దాడి కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా పోలీసులు బలమైన సాక్ష్యాలు సేకరిస్తున్నారు. సాంకేతిక ఆధారాలన్నీ పక్కాగా తీసుకుంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌ రాయదుర్గం(Hyderabad Rayadurgam)లో వంశీ నివసిస్తున్న గేటెడ్‌ కమ్యూనిటీ వద్ద సీసీ కెమెరాల్లో ఫుటేజీని తీసుకున్నారు. ఇందులో పలు కీలక ఆధారాలు లభించాయి. సత్యవర్ధన్‌ను విశాఖకు తీసుకెళ్లి తొలుత చేబ్రోలు శ్రీనుకు చెందిన ఫ్లాట్‌లో ఉంచారు. అనంతరం హోటల్‌కు తరలించారు. ఈ రెండుచోట్లా సీసీ కెమెరాల్లో వంశీ అనుచరులు సత్యవర్ధన్‌ను తీసుకెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. వీటిని విజయవాడ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం స్వాధీనం చేసుకుంది.

Also Read: సీఈసీ ఎంపికపై కమిటీ భేటి.. ఆయనకే బాధ్యతలు అప్పగిస్తున్నారా ?

మరోవైపు వల్లభనేని వంశీ కిడ్నాప్ కేసులో టీడీపీ కీలక ఆధారాలు బయట పెట్టింది. పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో  టీడీపీ సీసీ ఫుటేజ్ ని భయట పెట్టింది. హైదరాబాద్ లోని రాయదుర్గంలో వల్లభనేని వంశీ నివాసం ఉంటున్న అపార్ట్‌ మెంట్ లోని సీసీ ఫుటేజ్‌ తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. ఈ ఫుటేజ్‌ వంశీ కేసులో కీలకంగా మారింది.సత్యవర్ధన్ తో కలిసి వంశీ లిఫ్ట్ లో వెళుతున్న ఫుటేజ్‌ను టీడీపీ విడుదల చేసింది. వంశీతో పాటు ఆయన అనుచరులు సత్యవర్ధన్‌ను తన ఇంటికి తీసుకెళ్తున్న దృశ్యాలు అందలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈనెల 11న 9.53 నిమిషాలకు వెళ్తున్నట్లు సీసీ ఫుటేజ్‌లో రికార్డయింది.

 Also Read: బాలరాముడికి భారీగా విరాళాలు.. అమోధ్య రామమందిరం ఆదాయం దేశంలోనే

ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటిషన్‌ దాఖలు..

ఈ కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న ప్రధాన నిందితుడు వంశీని 10 రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కేసుకు సంబంధించి ఇంకా చాలా విషయాలు వెలికితీయాల్సి ఉందని, చాలా మంది నిందితులు దొరకలేదని ఆ పిటిషన్‌లో వివరించారు. పిటిషన్‌లో సాంకేతిక దోషాలున్నాయని న్యాయాధికారి చెప్పడంతో వెనక్కి తీసుకుని, సరిదిద్ది మళ్లీ దాఖలు చేశారు. అనంతరం ఇరుపక్షాలకు నోటీసులు జారీ చేయాలని న్యాయాధికారి ఆదేశించారు. కేసు నాలుగో ఏసీజేఎం కోర్టు నుంచి ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టుకు సోమవారం బదిలీ అయింది.

Also Read: ఏపీలో భారీగా జీబీఎస్ కేసులు.. ఆరోగ్య మంత్రి సత్యకుమార్ సంచలన ప్రకటన!

Also Read: సీఈసీగా జ్ఞానేష్ వద్దు.. కాంగ్రెస్ అభ్యంతరం చెప్పడానికి కారణం ఇదే?

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు