/rtv/media/media_files/2025/03/19/VTde785pm3H62hrNZueE.jpg)
phone explodes in pocket Photograph: (phone explodes in pocket)
Mobile Blast: మీరు పాయింట్ జేబులో ఫోన్ పెడుతున్నారా.. అయితే జాగ్రత్త. ఓ యువకుడు బైక్‌పై వెళ్తుండగా అతని పాయింట్ జేబులో ఉన్న మొబైల్ ఫోన్ పేలిపోయింది. దీంతో అతని ప్రైవేట్ పార్ట్ కాలిపోయింది. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్ రాజ్‌గఢ్ జిల్లాలోని సారంగ్‌పూర్‌లో చోటుచేసుకుంది. 19 ఏళ్ల అరవింద్ పానీ పూరీ అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. బైక్‌పై కూరగాయలు కొనడానికి సారంగ్‌పూర్ సంతకు వెళ్లి అతని సొంత ఊరు నైన్వాడకి వస్తున్నాడు. అతని ప్యాంటు జేబులో ఉన్న మొబైల్ ఫోన్ అకస్మాత్తుగా పేలిపోయింది. దాని కారణంగా అతను హైస్పీడ్ బైక్ నుండి బ్యాలెన్స్ కోల్పోయి హైవేపై పడిపోయాడు.
Also Read: దెయ్యాలతో చెడుగుడు ఆడేస్తాం.. ఎనీ డౌట్స్..?
Also Read: నాని 'గే' నా..? టాలెంటెడ్ హీరోని ట్రాన్స్ జెండర్ చేసారు కదరా..!
जेब में रखा मोबाइल फटा, प्राइवेट पार्ट डैमेज हुआ: युवक ने पुराना मोबाइल खरीदा था, रातभर चार्जिंग पर लगा था#Rajgarh #madhyapradeshnews https://t.co/1tjNi54vlH
— Dainik Bhaskar (@DainikBhaskar) March 18, 2025
సెకండ్ హ్యాండ్ ఫొన్ పేలడంతో..
మొబైల్ పేలడం వల్ల అరవింద్ ప్రైవేట్ పార్ట్స్ తీవ్రంగా గాయపడ్డాయి. అదే సమయంలో రోడ్డుపై పడిపోవడంతో అతని తల పగిలింది. అటుగా వెళ్తున్న వారు వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసి అతడిని సారంగ్‌పూర్ సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స తర్వాత, అతన్ని షాజాపూర్ ఆసుపత్రికి పంపించారు. అరవింద్ ఇటీవల రెడ్‌మి కంపెనీ చెందిన సెకండ్ హ్యాండ్ ఫొన్ కొన్నాడని అతని తమ్ముడు డాక్టర్లకు చెప్పాడు. రాత్రంతా ఛార్జింగ్ పెట్టి అతను దాన్ని జేబులో పెట్టుకుని కూరగాయలు కొనడానికి వెళ్లాడు. గంట తర్వాత తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ యువకుడి ప్రైవేట్ భాగాలు గాయపడ్డాయని సారంగ్‌పూర్‌కు చెందిన డాక్టర్ నయన్ నగర్ తెలిపారు. అయితే, ప్రాణాపాయం కలిగించే పరిస్థితి లేదు. ప్రాథమిక చికిత్స తర్వాత అతన్ని షాజాపూర్‌కు తరలించారు.
Also Read: Sub Inspector: లీవ్ లెటర్ బయటపెట్టిన స్కామ్.. లేడీ SI ఊచలు లెక్కించింది
Also Read: Nagpur violence : హింసకు కారణమైన ప్రధాన నిందితుడు అరెస్ట్