Nani Paradise: నాని 'గే' నా..? టాలెంటెడ్ హీరోని ట్రాన్స్ జెండర్ చేసారు కదరా..!

న్యాచురల్ స్టార్ నాని తాజాగా 'కోర్ట్' మూవీతో సూపర్ హిట్ అందుకుని 'హిట్ 3', 'పారడైజ్' మోవీస్ తో ఫుల్ బిజీ గా ఉన్నారు. అయితే తాజాగా "పారడైజ్" నుండి ఒక వార్త వైరల్ అవుతోంది. ఈ మూవీలో నాని ఒక ట్రాన్స్ జెండర్ పాత్రలో కనిపించనున్నారని టాక్ నడుస్తోంది.

New Update
Nani Paradise

Nani Paradise

Nani Paradise: కోర్ట్(Court) మూవీ సూపర్ సక్సెస్ తో ఫుల్ స్వింగ్ లో సినిమాలు చేస్తున్నాడు నాని. తాజాగా నాని లైన్ అప్ చుస్తే అన్ని పవర్ఫుల్ మూవీస్  కనిపిస్తున్నాయి. అటు నాని సొంతంగా నిర్మిస్తున్న మూవీ 'హిట్ 3'(Hit 3) ఇటు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) తో "పారడైజ్"(Paradise) అంటూ పలకరించబోతున్నాడు. రీసెంట్ గా విడుదలైన 'హిట్ 3' టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ ని డైరెక్టర్ శైలేష్ కొలను(Sailesh Kolanu) డైరెక్ట్ చేస్తున్నారు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొత్తం పూర్తి చేసుకొని ఈ చిత్రం మే 1న విడుదలకు సిద్ధమవుతోంది. 

Also Read: రా కి రా.. సార్ కి సార్..! గ్రోక్‌ ఏఐ దెబ్బ అదుర్స్ కదూ!

ఇక "పారడైజ్" విషయానికి వస్తే నాని ఫస్ట్ టైమ్ ఒక భారీ యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో విభిన్నమైన పాత్రలో కనిపిస్తున్నారు.  ఈ మూవీ గ్లిమ్ప్స్ చుసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. నాని డైలాగులు, వేషధారణ చాలా కొత్తగా ఉన్నాయి. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నాని తో పలికించిన " ఇది ఒక లం** కొడుకు కథ" అనే డైలాగుకైతే మొత్తం ఇండస్ట్రీ, ఇంటర్నెట్‌ రెండూ షాక్ అయ్యాయి. దీంతో "పారడైజ్" చిత్రం పై అంచనాలు ఆకాశాన్నంటాయి. 

Also Read: పూరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ సేతుపతి..!

ట్రాన్స్ జెండర్ పాత్రలో నాని...

ఇదిలా ఉండగా తాజాగా "పారడైజ్" మూవీ నుండి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ మూవీలో నాని ఒక ట్రాన్స్ జెండర్ పాత్రలో కనిపించనున్నారట. అది కూడా ఒక భారీ యాక్షన్ సీన్ కోసం నాని 'గే' వేషం వేస్తున్నాడని టాక్ నడుస్తోంది. ఇప్పటికే రిలీజైనా గ్లిమ్స్ లో నాని రెండు జడలతో, ముక్కుపుడకలతో కనిపించి షాకిచ్చాడు. 'గే' పాత్ర చేయడమంటే ఒకరకంగా రిస్క్ చేస్తున్నట్టే, మరి "పారడైజ్" లో నాని నిజంగానే అలంటి పాత్రలో కనిపిస్తున్నారా అన్న దానిపై స్పష్టత రావలసి ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీ చూపు మొత్తం నాని 'పారడైజ్' మీదే ఉంది. నాని నట విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూస్తారంటూ మూవీ యూనిట్ ఇప్పటికే మూవీపై హైప్ పెంచేశారు.

Also Read: స్పీడ్ పెంచేసిన డ్రాగన్ బ్యూటీ.. మళ్ళీ ఆ హీరోతో రిపీట్..

ఇక "పారడైజ్" స్టోరీ విషయానికి వస్తే నాని ఫస్ట్ టైమ్ ఒక ఇంటెన్స్ రోల్ లో చాలెంజింగ్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమా 1980ల నాటి సికింద్రాబాద్ లో నివసిస్తున్న ఒక చదువు లేని,  హక్కులు కోల్పోయి,  వెనకబడిన ఒక మార్జినలైజ్డ్ ట్రైబల్ గ్రూప్ కు సంబందించిన కథగా తెలుస్తోంది. కోల్పోయిన హక్కుల కోసం పోరాడే ఒక వ్యక్తి కథే ఈ సినిమా.  ట్రైబల్ జాతిలో ఒకడిగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడానికి నాయకుడిలా మారి యుద్ధంతో ఆ ట్రైబల్ జాతి  అన్ని హక్కులు తిరిగి ఇచ్చే దేవుడిలా నాని ఈ సినిమాలో పవర్ఫుల్ గా కనిపించనున్నాడు. అయితే మార్చ్ 26, 2026న ఈ మూవీ రిలీజ్ కాబోతుందని సమాచారం.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు