WPL 2025: మహిళల ప్రీమియర్ లీగ్‌-2025 వేలం ప్రారంభం..

మహిళల ప్రీమిర్ లీగ్‌-2024 సీజన్‌ కోసం వేలం ప్రారంభమయ్యింది. బెంగళూరు వేదికగా ఈ కార్యక్రమం జరుగుతోంది. దేశ, విదేశాలకు చెందిన 120 మందిపై వేలం జరగనుంది. మొత్తం ఐదు జట్ల మహిళా క్రికెటర్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేయనున్నాయి.

New Update
WPL

మహిళల ప్రీమిర్ లీగ్‌-2024 సీజన్‌ కోసం వేలం ప్రారంభమయ్యింది. బెంగళూరు వేదికగా ఈ కార్యక్రమం జరుగుతోంది. దేశ, విదేశాలకు చెందిన 120 మందిపై వేలం జరగనుంది. మొత్తం ఐదు జట్ల మహిళా క్రికెటర్లను ఫ్రాంచైజీలు  కొనుగోలు చేయనున్నాయి. ఒక్కో టీమ్‌లో 18 మంది వరకు ఉండొచ్చు. అయితే 19 స్లాట్‌లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఐదు విదేశీ ప్లేయర్లవి ఉన్నాయి.  

Also Read: భారత్ vs ఆస్ట్రేలియా.. తొలిరోజు వరుణుడిదే ఆధిక్యం.. వారమంతా వర్షాలే!

WPL 2025 Auction Commenced

భారత్‌కు చెందిన పూనమ్‌ యాదవ్, శుభా సతీశ్, స్నేహ్ రాణా తదితరులు ఈ లిస్ట్‌లో ఉన్నారు. విదేశీ ప్లేయర్లలో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హీథర్ నైట్, దక్షిణాఫ్రికా ప్లేయర్ లిజెల్ లీ, ఇంగ్లండ్ క్రికెటర్ లారెన్ బెల్ తదితరులపై ఫ్రాంచైజీ ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉంది. ఇక 13 ఏళ్ల లెఫ్ట్‌ ఆర్మ్‌ ఫాస్ట్‌ బౌలర్ అయిన అన్షు నగార్ ఇందులో హైలెట్ కానుంది. 3 నెలల క్రితం మహిళల ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ఆమె తన ప్రదర్శనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

Also Read: సీఎంకి తలనొప్పిగా మారిన నాటుకోడి చికెన్ వివాదం.. వీడియో వైరల్!

ఏ జట్ల వద్ద ఎంతున్నాయంటే ?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:3.25 కోట్లు (4 స్లాట్‌లు)
ముంబయి ఇండియన్స్‌: రూ. 2.65 కోట్లు (4 స్లాట్‌లు)
గుజరాత్ జెయింట్స్: 4.4 కోట్లు ( 4 స్లాట్‌లు)
ఢిల్లీ క్యాపిటల్స్: రూ. 2.5 కోట్లు (4 స్లాట్లు ఖాళీ)
యూపీ వారియర్స్: రూ. 3.90 కోట్లు (3 స్లాట్‌లు)

Also Read: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Also Read: జమిలి ఎన్నికల బిల్లుకు బ్రేక్.. పునరాలోచనలో పడ్డ కేంద్రం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు