/rtv/media/media_files/2025/04/19/rWDv5IWRqkjQoWlJA4HT.jpg)
భార్యల వివాహేత సంబంధాల కారణంగా బలవుతున్న భర్తల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మీరట్ సౌరవ్, అమిత్‌ల హత్య సంచలనంగా మరిన విషయం తెలిసిందే. కొన్నిరోజుల క్రితమే మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో తాజాగా మరో హత్య ఇలాగే జరిగింది. ఓ మహిళ ఛాయ్‌లో ఎలుకల మందు కలిపి భర్తకు ఇచ్చింది. తర్వాత ప్రియుడితో కలిసి భర్త కేహర్ సింగ్ గొంతునొక్కి హత్య చేసింది. మృతదేహాన్ని సీలింగ్‌కు వేలాడదీసి ఉరేసుకున్నట్లు నమ్మించాలని ప్లాన్ వేసింది. కానీ.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో అసలు విషయం బయటపడింది. దీంతో భార్య రేఖను, ఆమె ప్రియుడు పింటూను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫతేగంజ్‌లో నివసిస్తున్న కేహర్ సింగ్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. 16ఏళ్ల కింద అతనికి 25 ఏళ్ల రేఖతో వివాహం జరిగింది. వారికి నలుగురు పిల్లలున్నారు.
Planned well but failed.
— ShoneeKapoor (@ShoneeKapoor) March 25, 2025
She wanted husbands property and planned to settle with the boyfriend Anurag.
She brought a bottle of poison with her, and tried to kill the husband just after the marriage, but failed.
Later, she hired someone to do the job.
This husband-killing trend… https://t.co/pynqK8yHxm pic.twitter.com/GoVdbADa4G
Also read: Azharuddin- HCA: అజారుద్దీన్‌కు బిగ్ షాక్.. ఉప్పల్ స్టేడియంలో ఆయన పేరు మాయం
ఆత్మహత్యగా చిత్రీకరించి..
రేఖకు పింటూతో వివాహేతర సంబంధం ఏర్పడింది. కేహర్ సింగ్‌కు ఇది తెలియడంతో ఏడాదిగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో పూర్తిగా భర్త అడ్డును తొలగించుకొని ప్రియుడితో సెట్టిల్ అవుదామని ప్లాన్ వేసి భర్తను మర్డర్ చేసింది. ఏప్రిల్ 13న ఆదివారం రాత్రి టీలో ఎలుకల మందు కలిపి భర్తకు ఇచ్చింది. ఆ తర్వాత ప్రియుడు పింటూను తన ఇంటికి పిలిచింది. వారిద్దరూ కలిసి గొంతు నొక్కి కేహర్ సింగ్‌ను హత్య చేశారు. అనంతరం భర్త మెడకు తాడు బిగించి సీలింగ్‌కు వేలాడదీశారు. ఏమి తెలియనట్లు సోమవారం తెల్లవారుజామున తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని రేఖ ఏడుస్తూ పెడబొబ్బలు పెట్టింది. పక్కింటివారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Also read: Hydra: TDP ఎమ్మెల్యేకు హైడ్రా షాక్.. 20 ఎకరాల్లో నిర్మాణాల కూల్చివేత
పోలీసులు అక్కడికి చేరుకొని కేహర్ సింగ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. గొంతు నొక్కి అతడ్ని చంపినట్లు పోస్టుమార్టం రిపోర్ట్‌లో బయటపడింది. దీంతో రేఖను అదుపులోకి పోలీసులు ప్రశ్నించారు. ప్రియుడు పింటూతో కలిసి భర్తను హత్య చేసినట్లు ఆమె ఒప్పుకున్నదని పోలీస్ ఆఫీసర్ తెలిపారు. దీంతో వారిని అరెస్ట్ చేశారు.
(Tags : Woman kills husband | Woman kills husband with boyfriend | poison | uttara-pradesh | latest-telugu-news)