/rtv/media/media_files/2025/04/19/LvIpEdbkVdn8zoBwSvMV.jpg)
Azharuddin
Azharuddin- HCA: టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌కు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ షాక్ ఇచ్చింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలోని నార్త్ పెవిలియన్‌కు అజారుద్దీన్ పేరు తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. అజారుద్దీన్‌పై 2019లో నమోదైన కేసు విచారణ కొనసాగుతుంది. సుప్రీంకోర్టు విశ్రాంత నాయ్యమూర్తి వి. ఈశ్వరయ్య నార్త్ స్టాండ్‌ను అజారుద్దీన్ పెవిలియన్‌గా పిలవకూడదని శనివారం హెచ్‌సీఏను ఆదేశించారు. నార్త్ స్టాండ్‌ను ఇక నుంచి అజారుద్దీన్ పేరుతో పిలవకూడదని హెచ్‌సీఏ ప్రకటించింది.
Also read: Hydra: TDP ఎమ్మెల్యేకు హైడ్రా షాక్.. 20 ఎకరాల్లో నిర్మాణాల కూల్చివేత
The Ombudsman has directed the removal of 'Mohammed Azharuddin Stand' from the North Pavilion at the Rajiv Gandhi International Cricket Stadium in Uppal, Hyderabad. The order also instructs that no tickets should be printed bearing the former Indian captain and ex-HCA president's… pic.twitter.com/7XdzOdthbt
— Hyderabad Mail (@Hyderabad_Mail) April 19, 2025
Also read: Woman Elopes: 43ఏళ్ల వయసులో ఇదేం పని ఛీఛీ.. వీయ్యంకుడితో లేచిపోయిన మహిళ
టీమిండియా మాజీ కెప్టెన్ అయిన అజారుద్దీన్ 2019లో హెచ్‌సీఏకు అధ్యక్షుడిగా సేవలందించాడు. ఆ సమయంలోనే ఆయన ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. వీవీఎస్ లక్ష్మణ్ పేరు మీద ఉన్న నార్త్ స్టాండ్‌కు.. అజారుద్దీన్ తన పేరు పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని తీవ్ర తప్పిదంగా పరిగణించిన అంబుడ్స్‌మన్ నార్త్ స్టాండ్‌ని ఇకపై అజారుద్దీన్ పెవిలియన్‌గా పిలకూడదని హెచ్‌సీఏకు ఆదేశాలు ఇచ్చింది. అంతేకాదు ఇకపై మ్యాచ్ టికెట్ల మీద కూడా అజారుద్దీన్ పేరు ఉండకూడదని తెలిపింది. దాంతో.. అంబుడ్స్‌మన్ ఆదేశాలను హెచ్‌సీఏ అమలు చేయనుంది. ఈమధ్యే హెచ్‌సీఏ, సన్‌రైజర్స్ జట్టు యాజమాన్యం మధ్య కాంప్లిమెంటరీ పాస్‌ల విషయంలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. తమను ఇబ్బంది పెడుతున్నారని SRH ఫ్రాంచైజీ ఏకంగా బీసీసీఐకి లేఖ రాసింది.
Also read: Jwalapuram: ఇండియా చరిత్ర మార్చబోతున్న జ్వాలాపురం.. 74వేల ఏళ్ల క్రితంనాటి ఆనవాళ్లు
Also read: Hydra: TDP ఎమ్మెల్యేకు హైడ్రా షాక్.. 20 ఎకరాల్లో నిర్మాణాల కూల్చివేత
( cricket | hca | mohammad-azharuddin | uppal-staduim | telugu-latest-news)