ఈ మధ్యకాలంలో విహహేతర సంబంధాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. వీటికోసం భార్యభర్తలు చంపుకునే పరిస్థితులు వచ్చాయి. వివాహం అయ్యాక ప్రియుడితో భార్య లేదా ప్రియురాలితో భర్త అక్రమ సంబంధాలు పెట్టకోవడం, విషయం బయటపడితే దంపతుల మధ్య ఘర్షణలు చెలరేగి ప్రాణాలు బలితీసుకుంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ కామం ఒకే ఇంట్లో ముగ్గురు మగాళ్లను బలితీసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. బమ్రౌలి కటారాకు చెందిన బబ్లీ అనే మహిళకు కొన్నేళ్ల క్రితం హరిఓమ్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది.
Also Read: వీధి కుక్కల వల్ల ఇన్ని లాభాలా.. అవి లేకుంటే భయంకరమైన వ్యాధులే
ఆ దంపతులకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. అయితే బబ్లీ తన ప్రియుడు ప్రేమ్‌సింగ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం భర్తకు తెలియడంతో ఇరువురి మధ్య గొడవలు జరిగేవి. ఓ రోజు బబ్లీ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. తల్లి ప్రవర్తన వల్ల కొడుకు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. దీంతో బబ్లీకి పోలీసులు ఐదేళ్లు జైలు శిక్ష విధించారు. ఇటీవల బెయిల్‌పై విడుదలైన ఆమె.. కేసు మాఫీ కోసం తన మామతో కూడా గొడవకు దిగింది. చివరికి అతడిని కూడా హత్య చేసింది. కోడలి స్వార్థం, క్రూరత్వంతో ఆ కుటుంబం సర్వస్వం కోల్పోవడం కలకలం రేపింది.
Also Read: పల్సర్ బైక్ కొనివ్వలేదని .. కన్నతండ్రిపైనే కొడుకు హ*త్యాయత్నం