Nirmala Sitharaman : నిర్మలమ్మ రికార్డు..  దేశ చరిత్రలోనే తొలి ఆర్థిక మంత్రిగా!

ఒకే ప్రధాన మంత్రి (నరేంద్ర మోదీ) హయాంలో వరుసగా 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ సరికొత్త చరిత్ర సృష్టించారు. గతంలో మొరార్జీ దేశాయ్ 10 సార్లు

New Update
nirmala

భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(nirmala-sitharaman) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఆదివారం పార్లమెంటులో ఆమె వరుసగా 9వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. దేశ చరిత్రలో వరుసగా ఇన్నిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక ఆర్థిక మంత్రిగా ఆమె రికార్డులకెక్కారు.  ఈ ఘనత సాధించిన దేశపు తొలి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ నిలిచారు.  

Also Read :  అబ్బబ్బా.. మామూలు మాయలేడి కాదు.. ముగ్గురు మొగుళ్లను ముంచేసింది!

నిర్మలా సీతారామన్ సరికొత్త చరిత్ర 

అంతేకాకుండా ఒకే ప్రధాన మంత్రి (నరేంద్ర మోదీ) హయాంలో వరుసగా 9 సార్లు బడ్జెట్(Union Budget 2026-27) ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ సరికొత్త చరిత్ర సృష్టించారు. గతంలో మొరార్జీ దేశాయ్ 10 సార్లు, పి. చిదంబరం 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ, వారు వేర్వేరు ప్రధానుల దగ్గర లేదా వేర్వేరు విడతలుగా (మధ్యలో గ్యాప్ ఇచ్చి) పనిచేశారు. 

2019 నుండి 2026 వరకు అంటే గత 7 బడ్జెట్లు, 1 మధ్యంతర బడ్జెట్, ఇప్పుడు రాబోయే బడ్జెట్‌తో కలిపి మొత్తం 9 సార్లు ఆమె వరుసగా ప్రవేశపెట్టినట్లవుతుంది. గతంలో ఏ ఆర్థిక మంత్రి కూడా ఒకే ప్రధాని హయాంలో ఇంత సుదీర్ఘ కాలం నిరంతరాయంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేదు

2019 మే 31న బాధ్యతలు చేపట్టిన ఆమె, నేటికి (జనవరి 31, 2026) ఆరేళ్ల ఎనిమిది నెలల పాటు నిరంతరాయంగా పదవిలో కొనసాగుతున్నారు. దీనితో గతంలో సి.డి. దేశ్‌ముఖ్ (6 ఏళ్ల 2 నెలలు) పేరిట ఉన్న రికార్డును ఆమె అధిగమించారు. నిర్మలమ్మ వరుసగా 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టడం భారత పార్లమెంటరీ చరిత్రలోనే గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. 

సాధారణంగా ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వారిలో మొరార్జీ దేశాయ్ (10 సార్లు), పి. చిదంబరం (9 సార్లు) ఉన్నప్పటికీ.. వారు వరుసగా అన్నిసార్లు ప్రవేశపెట్టలేదు. మధ్యలో విరామాలు ఉన్నాయి. ఆర్థిక సరళీకరణ పితామహుడిగా పేరున్న మన్మోహన్ సింగ్ సుమారు 5 ఏళ్ల పాటు ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 4 ఏళ్ల 8 నెలల పాటు ఈ బాధ్యతలు నిర్వహించారు.

Also Read :  Cyber Crime: సైబర్ నేరాలు.. కోటిన్నర మొబైల్‌ నంబర్లు బ్లాక్‌ చేసిన కేంద్రం

Advertisment
తాజా కథనాలు