AP Crime: నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే 15 మందికి..

నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బొగ్గు లారీని వెనుక నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సు క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్‌తో సహా దాదాపు 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

New Update

Nellore Road Accident: ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బొగ్గు లారీని ఢీకొట్టిన రోడ్డు ప్రమాదం నెల్లూరు జిల్లా నాయుడుపేటలో జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవరుతో సహా సుమారు 15 మందికి గాయాలయ్యారు. కాగా బస్సు క్లీనర్ అక్కడికక్కడే ప్రాణం వదిలాడు. వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలు నుంచి బెంగళూరుకు ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సేవలను అందిస్తోంది. బెంగళూరు వెళ్ళేందుకు టిక్కెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు తమకు కేటాయించిన బస్సు ఎక్కారు. వారిని ఎక్కించుకున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రయాణికులను ఒంగోలు నుంచి బెంగళూరుకు బయలుదేరింది. ప్రైవేట్ ట్రావెల్స్ కావడంతో సాధారణంగానే రాష్ట్ర రవాణ సంస్థ బస్సుల కంటే కొంచెం వేగంగా ప్రయాణిస్తోంది. ప్రయాణంలో భాగంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నాయుడుపేట సమీపానికి రాగానే బస్సు ఎదురుగా బొగ్గు లోడ్‌తో వెళ్తున్న ఓ లారీని బస్సును ఓవర్ టేక్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే 30 మందికి పైగా ప్రయాణికులతో బయలుదేరిన ఆ బస్సు లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టి ప్రమాదానికి గురైంది. 

15 మందికి గాయాలు..

ఈ రోడ్డు ప్రమాదంలో బస్సు ముందు భాగంగా దెబ్బతినగా బస్సు క్లీనర్ అక్కడికక్కడే ప్రాణం వదిలాడు. అంతేకాకుండా డ్రైవరు కూడా ఎక్కువ గాయాలకు గురయ్యారు. బస్సు ముందు భాగంలో కూర్చున్న ప్రయాణికులు సుమారు 15 మంది గాయాలపాలైనట్లు సమాచారం. ఇది గమనించి ఇతర వాహనదారులు వెంటనే సహాయ చర్యలకు దిగే ప్రయత్నం చేశారు. ప్రమాదం గురించి సమాచారాన్ని పోలీసులకు తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలను చేపట్టారు. ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.  

ఇది కూడా చదవండి: తెలంగాణలో గుండెపగిలే విషాదం.. తరగతులు అర్థం కావడం లేదని బాలిక సూసైడ్!

ఇటీవల నెల్లూరు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు లారీలను ఢీకొట్టే ప్రమాదాలు పెరిగిపోవడం పట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రెండు రోజుల క్రితం   కావలి మండలంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో కూడా విజయవాడకు చెందిన కోదాటి రాజు అనే డ్రైవర్ ప్రాణం వదిలాడు.   కావలి మండలంలోని అడవిరాజు పాళెం దాటిన తరువాత జాతీయ రహదారిపై వెళ్తున్న లారీని బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా స్టీరింగ్, సీటు మధ్యలో చిక్కుకపోయి డ్రైవర్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కోవూరు మండల పరిధిలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో బెంగళూరు నుంచి విజయవాడ వైపు వస్తున్న ఆ బస్సులోని కేబిన్ లో కూర్చున్న నాని అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వరుస ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలు జిల్లా వాసులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రమాదాలపై డ్రైవర్లతోపాటు లారీ డ్రైవర్లకు కూడా అవగాహన కల్పించాలని కోరుతున్నారు.

ఇది కూడా చదవండి: ఏపీలో ట్రిపుల్ మర్డర్‌ కలకలం.. తల్లీబిడ్డల దారుణ హ*త్య

(Latest News | telugu-news) 

Advertisment
తాజా కథనాలు