Bengaluru: బస్సు కోసం అడిగితే ఎత్తుకెళ్ళి రేప్ చేశారు..బెంగళూరు టెర్రర్

బెంగళూరులో కొందరు దుండగులు అరాచకం సృష్టించారు. బస్సు కోసం వెయిట్ చేస్తున్న 37 మహిళపై దారుణానికి ఒడిగట్టారు. ఆమెను లైంగికంగా వేధించడమే కాకుండా మొబైల్, నగలు, డబ్బులు దోచుకెళ్లారు. 

author-image
By Manogna alamuru
New Update
girl raped

బెంగళూరులో కేఆర్ మార్కెట్ దగ్గరలో ఆదివారం అర్ధరాత్రి ఇద్దరు దుండగులు ఒక మహిళ పట్ల దౌర్జన్యానికి పాల్పడ్డారు. బస్సు కోసం వెయిట్ చేస్తున్న 37 ఏళ్ళ మహిళను ఎత్తుకెళ్ళి రేప్ చేశారు. అక్కడితో వదిలేయకుండా ఆమె ఫోన్, నగలు, డబ్బును కూడా దోచుకెళ్లారు. అర్థరాత్రా 11.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. గోడౌన్ స్ట్రీట్ దగ్గరలో ఇది జరిగినట్లు తెలుస్తోంది. 

Also Read : హనీ రోజ్ కేసులో బిగ్ ట్విస్ట్..  ఆ ఇద్దరు అధికారులు సస్పెండ్

ఒంటరి మహిళ మీద అఘాయిత్యం...

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..బాధితురాలు కొన్ని రోజులై ఒంటరిగా ఉంటున్నారు. ఆమె భర్తతో గొడవలు రావడంతో ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. ఈ క్రమంలో  ఆ మహిళ యలహంకకు బస్సుల గురించి ఆరా తీస్తుండగా.. బస్టాప్ వేరే చోట ఉందని చెబుతూ ఇద్దరు వ్యక్తులు ఆమెను వేరే చోటుకి తీసుకెళ్ళారు.  ఆ తర్వాత వారు ఆమెను గోడౌన్ స్ట్రీట్‌లోని ఏకాంత ప్రదేశానికి ఎత్తుకెళ్లారు.  అక్కడ వారిద్దరూ ఆమెపై దాడి చేసి ఆమె మొబైల్ ఫోన్, నగలు మరియు నగదును అపహరించారు. అప్పుడే ఆమెపై బలాత్కారం కూడా కావించారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం కంప్లైంట్ నమోదు చేసుకున్నారు పోలీసులు. ఆ తరువాత మహిళను షెల్టర్ హోంకు తరలించారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని బెంగళూరు పోలీస్ కమిషనర్ బి దయానంద తెలిపారు. 

Also Read: IT Raids: దిల్ రాజు ఇంట్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు

Advertisment
తాజా కథనాలు