/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Volunteer-Neelapu-Sivakumar-rapes-minor-girl-in-Dendulur-Eluru-district-jpg.webp)
AP 10th Class girl sexually assaulted by lab technician
AP News: ఏపీలో మరో దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో పదో తరగతి బాలికపై లైంగిక దాడి చేశాడు ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ కుమార్. ఆమె ఏడు నెలల గర్భం దాల్చడంతో ఓ ప్రవేటు ఆస్పత్రిలో నర్సు సాయంతో అబార్షన్ చేయించాడు. బాలిక కుటుంబ సభ్యల ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విజయ్ ని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.
హెచ్ఐవీ మందుల కోసం వస్తే..
ఈ మేరకు రాయచోటి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 10వ తరగతి చదువుతున్న బాలిక హెచ్ఐవీ మందుల కోసం ప్రతి నెలా రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి వస్తోంది. ఈ సమయంలోనే అదే ఆస్పత్రిలో రోజు వారీ వేతనంపై పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ విజయ్.. ఆమెపై కన్నేశాడు. ఎవరు లేని టైమ్ లో బలవంతంగా లైంగికదాడి చేశాడు.
ఇది కూడా చదవండి: RRB: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. RRBనుంచి 32,438 ఉద్యోగాలకు నోటిఫికేషన్!
దీంతో గర్భం దాల్చి ఏడు నెలలు గడించింది. కొంతకాలంగా మౌనంగా ఉన్న విజయ్.. ఇటీవల ఆమెకు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేసే ఓ నర్సు సాయంతో అబా ర్షన్ చేయించాడు. బాలిక కుటుంబానికి విషయం తెలియడంతో రాయచోటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడు విజయ్ పై పోక్సో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు అర్బన్ సీఐ చంద్రశేఖర్ తెలిపారు.