/rtv/media/media_files/2025/04/26/dgEvJSb4gbSAg2RQrr9U.jpg)
Elephant Dung Dessert
Elephant dung : ఏనుగు పేడ తెలుసు కదా? అ మధ్య ఏదో సినిమాలో ఏనుగు పేడకు విదేశాల్లో లక్షల్లో ధర పలుకుతుందని చెప్పి ఏనుగు పేరుతో లోను తీసుకుంటాడు హీరో. ఇది కొంత నయమే కానీ చైనా మరో అడుగు ముందుకేసి ఏనుగు పేడను డెజర్ట్‌గా మార్చి విక్రయిస్తోంది. షాంఘైలోని కానోపియా అనే రెస్టారెంట్ డెటర్జ్‌ను తయారు చేసింది. ఇకోలాజికల్ ఫ్యూజన్ క్యూసిన్‌లో భాగంగా ‘‘ఫ్లవర్స్ ఇన్సర్టెడ్ ఇంటూ ఎలిఫెంట్ డంగ్’’ అనే కొత్త వంటకాన్నిపరిచయం చేస్తున్నట్లు ఆ రెస్టారెంట్ ప్రకటించింది. ఇంతకీ దీని ధర ఎంతో తెలిస్తే కండ్లు బైర్లు కమ్మాల్సిందే. అవును భారతీయ కరెన్సీలో దీని ధర అక్షరాల రూ.50 వేలు.
ఇది కూడా చదవండి: పల్నాడులో ప్రైవేట్ బస్సు బోల్తా.. స్పాట్‌లోనే ఐదుగురికి..
కాగా రెయిన్‌ఫారెస్ట్ పోషక చక్రం నుంచి స్ఫూర్తి పొందిన ఈ వంటకం.. క్రిమిరహితం చేయబడిన, ఎండిన ఏనుగు పేడను క్రిస్పీ రొట్టెలుగా చేసి, దానిపై హెర్బల్ పెర్ఫ్యూమ్, ఫ్రూట్ జామ్, పుప్పొడి, తేనెతో అలంకరించారు. ఈ పేడను యున్నాన్ ఏనుగు సంరక్షణ కేంద్రం నుంచి సేకరించి.. అధిక ఉష్ణోగ్రత, అతినీలాలోహిత ట్రీట్‌మెంట్‌తో క్రిమిరహితంగా మార్చేశారు. ఏడేళ్ల పరిశోధన తర్వాత ఈ డెజర్ట్‌ను పరిచయం చేస్తున్నట్లు రెస్టారెంట్ యజమానులు తెలిపారు... అయితే ఈ వంటకం పై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వినడానికే అసహ్యంగా ఉన్న ఈ డెజర్ట్ విషయంలో రెస్టారెంట్ చెబుతున్న విషయాలపై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనార్జనే ధ్యేయంగా ఇలాంటి రెస్టారెంట్లు ఎంతకైనా తెగిస్తాయని మండిపడుతున్నారు. అయితే మరికొంతమంది మాత్రం దేనికైనా కొత్త క్రియేటివిటీ ఉండాలని అంటున్నారు.
Also Read: All-party Meeting: ముగిసిన ఆల్ పార్టీ మీటింగ్.. కశ్మీర్‌లో రాహుల్ గాంధీ పర్యటన
నిజానికి చైనా ఆహార శుభ్రత చట్టం ప్రకారం ఆహారం విషరహితంగా, హానిరహితంగా ఉండాలి. కానీ ఈ డెజర్ట్ ఈ ప్రమాణాలకు అనుగుణంగా ఉందా లేదా అనేది రెస్టారెంట్ స్పష్టత నివ్వలేదు. ఎందుకంటే జంతు విసర్జనను వంటకాలలో ఉపయోగించడం ఇంతకు ముందెన్నడు లేదు. అయితే ఈ డెజర్ట్‌పై ప్రజల ఆగ్రహం, మీడియా, సోషల్ మీడియా ఫోకస్ చేసిన తర్వాత.. షాంఘై అధికారులు కానోపియా రెస్టారెంట్‌పై ఆహార భద్రత నిబంధనల ఉల్లంఘనలపై విచారణ ప్రారంభించారు. దీంతో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేశారు. అయితే యజమానులు మాత్రం ఇకోలాజికల్ అనుసంధానాన్ని హైలెట్ చేసేందుకు చేసిన తమ ప్రయత్నాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.