/rtv/media/media_files/2025/08/28/andhra-2025-08-28-13-41-31.jpg)
ఏపీలో ఘోరం జరిగింది. పాఠాలు చెప్పాల్సిన ఓ లెక్చరర్ కామాంధుడిగా మారాడు. అనకాపల్లి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ మహిళా కళాశాలలో పనిచేస్తున్న కెమిస్ట్రీ లెక్చరర్ ఓ17 ఏళ్ల విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలపై అరెస్టు చేశారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పరవాడ పోలీసులు లైంగిక నేరాలు, పిల్లల రక్షణ చట్టం (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ సంఘటన ఆగస్టు 23న జరిగింది. మధ్యాహ్నం1.20 గంటలకు విద్యార్థిని లంచ్ చేసి తరువాత కెమిస్ట్రీ లెక్చరర్ పిలిచాడని గ్రౌండ్ ఫ్లోర్ లోని లాబొరేటరీకి వెళ్లింది.
Also Read:భారత్‌కు ట్రంప్ వినాయక చవితి బంపరాఫర్.. ఆ ఒక్క పని చేస్తే 25 శాతమే సుంకాలు
పేపర్ చెక్ చేస్తున్నట్లు నటిస్తూ
బాధితురాలు అక్కడికి వెళ్ళినప్పుడు లెక్చరర్ ఆమె ఎగ్జామ్ పేపర్ చెక్ చేస్తున్నట్లు నటిస్తూ బాధితురాలిని తన వైపుకు లాక్కుని నడుము, వీపు, ఛాతీని తాకుతూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. అనంతరం అక్కడి నుంచి బయటకు వచ్చిన బాధితురాలు ఇంటికి వెళ్లి తన తల్లికి జరిగిన ఈ విషయాన్ని చెప్పింది, ఆ తర్వాత ఆగస్టు 24న పరవాడ పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసును దర్యాప్తు కోసం మహిళా సబ్-ఇన్‌స్పెక్టర్‌కు అప్పగించారు. ప్రాథమికంగా ఆధారాలు లభించాయని, గుత్తల శ్రీధర్‌గా గుర్తించబడిన లెక్చరర్‌ను ఆగస్టు 24న రాత్రి 10 గంటలకు అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు ఫిర్యాదుపై వేగంగా చర్య తీసుకున్నారని పరవాడ సిఐ మల్లికార్జున తెలిపారు. శక్తి యాప్, అవగాహన సదస్సుల వల్ల విద్యార్థినులు వెంటనే ఫిర్యాదు చేయడం మంచి పరిణామమని ఆయన పేర్కొన్నారు.
Also Read : September Bank Holidays : సెప్టెంబర్ లో 15 రోజులు బ్యాంకులు బందే.. లిస్టు ఇదే!
కోనసీమ జిల్లాలో దారుణం
ఏపీలోని డా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రావులపాలెం మండలం గోపాలపురంలో భర్తపై పెట్రోల్ పోసి భార్య నిప్పంటించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మట్ట శ్రీను, మట్ట ఏంజలీనా జెన్నీఫర్ థామస్ భార్య భర్తలు వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అయితే కొంత కాలంగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఇంట్లో నిద్రపోతున్న మట్ట శ్రీను పై తెల్లవారుజామున సుమారు మూడు గంటల ప్రాంతంలో పెట్రోల్ పోసి నిప్పంటించి తలుపుకు గడియ పెట్టింది. అయితే మంటల తాటికి తట్టుకోలేక శ్రీను కేకలు వేయడంతో స్థానికులు గుర్తించి ఆయనను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన భర్త ప్రతిరోజు తాగివచ్చి వేధించడంతో వేధింపులు తాళలేక ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న మట్టా శ్రీను పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.