Akhanda 2: బోయపాటి శ్రీను- బాలయ్య కాంబోలో రాబోతున్న 'అఖండ 2' అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన 'అఖండ' మొదటి భాగం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా 'అఖండ 2' తీస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ బాలయ్య డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ఫ్యాన్స్ కి పిచ్చెక్కించాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
హై యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో కొన్ని రొమాంటిక్ సీన్లు కూడా పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాదు ఓ స్పెషల్ సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
తాజా అప్డేట్ ప్రకారం.. ఈ స్పెషల్ సాంగ్ కోసం యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నారట డైరెక్టర్ బోయపాటి. సంయుక్త ట్రెడిషనల్ గా, చూడడానికి ఫ్యామిలీ హీరోయిన్ల కనిపిస్తుంది. అలాంటి ఆమె ఐటం సాంగ్ చేస్తే జనాల్లో కూడా ఆసక్తి పెరుగుతుందని.. అందుకే మేకర్స్ ఆమెను రంగంలోకి దింపుతున్నారని టాక్ వినిపిస్తోంది. మరి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.