/rtv/media/media_files/2025/03/02/nwlH32qcf0BYMBru3wsC.jpg)
Moradabad court Acid attack on female lawyer
Acid attack: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం జరిగింది. శశిబాల మొరాదాబాద్ కోర్టు ఆవరణలో ఓ మహిళా న్యాయవాదిపై ఇద్దరు వ్యక్తులు యాసిడ్ దాడి చేశారు. దీంతో ఆమె చీర పలుచోట్ల కాలిపోగా శరీరంపై గాయాలయ్యాయి. నిందితులు సచిన్ కుమార్, నితిన్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఉదయం 10 గంటల సమయంలోనే..
ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన గురువారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో జరిగింది. బాధితురాలైన న్యాయవాది శశిబాల కోర్టు ప్రాంగణంలోని గేటు దగ్గర కారు దిగి లోపలికి వస్తుండగానే అకస్మాత్తుగా సచిన్ కుమార్, నితిన్ కుమార్ అనే ఇద్దరు యువకులు వచ్చి కంట్రీ మేడ్ పిస్టల్ గురిపెట్టారు. 'ఈ రోజు మేము నీకు మంచి బహుమతి ఇస్తాం' అంటూ అరిచారు. దీంతో ఆమె తప్పించుకునే ప్రయత్నం చేయగా యాడిడ్ బాటిల్ ఆమెపై విసిరేసి పారిపోయారు. న్యాయవాది శశిబాల దుస్తులు, ఆమె శరీరంలోని కొన్ని భాగాలు కాలిపోయాయి. ఆ యువకులిద్దరూ ఉత్తరాఖండ్ నివాసితులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
Also Read : న్యూజిలాండ్ తో భారత్ మ్యాచ్ ఈరోజు.. విజయపరంపర కొనసాగిస్తుందా..
ఇక న్యాయవాది శశిబాల ప్రస్తుతం లైంగిక వేధింపులు, వరకట్న వేధింపుల కేసులు సహా కేసుల్లో పోరాడుతోందని చెప్పారు. అయితే ఈ దాడిని న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. నిందితులను త్వరగా అరెస్టు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. అయితే ఇప్పటికే ఇద్దరు నిందితులపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 124(1), 351(3) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు అనుమానాస్పదంగా ఉందని పోలీసు సూపరింటెండెంట్ (గ్రామీణ) కున్వర్ ఆకాష్ సింగ్ అన్నారు. సీసీటీవీ ఫుటేజీలో నిందితులిద్దరూ వేరే చోట కనిపిస్తున్నారు. ఇది యాసిడ్ దాడి కేసు కాదు. బదులుగా ఇది ఏదో మండే పదార్థానికి సంబంధించిన విషయం. అయితే వైద్య నివేదికలో కూడా ఇది నిర్ధారించబడలేదు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Also Read : దారుణ హత్య... సూట్‌కేస్‌లో కాంగ్రెస్ మహిళా కార్యకర్త డెడ్ బాడీ!