దారుణ హత్య... సూట్‌కేస్‌లో కాంగ్రెస్ మహిళా కార్యకర్త డెడ్ బాడీ!

హర్యానాలోని రోహ్‌తక్ జిల్లాలోని బస్టాండ్ సమీపంలో సూట్‌కేస్‌లో కాంగ్రెస్ మహిళా కార్యకర్త హిమాని నర్వాల్ (22)  మృతదేహాం లభ్యమైంది.  మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో సమయంలో ఆయనతో కలిసి హిమాని నర్వాల్ పాల్గొన్నారు.  

New Update
 Himani Narwal

హర్యానాలో దారుణం జరిగింది.  రోహ్‌తక్ జిల్లాలోని బస్టాండ్ సమీపంలో సూట్‌కేస్‌లో కాంగ్రెస్ మహిళా కార్యకర్త హిమాని నర్వాల్ (22)  మృతదేహాం లభ్యమైంది.  మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె మెడలో స్కార్ఫ్ చుట్టుకుని ఉండగా..  చేతులకు మెహందీ కూడా ఉంది. పార్టీ ఎంపీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో సమయంలో ఆయనతో కలిసి హిమాని నర్వాల్ పాల్గొన్నారు.  హిమాని నర్వాల్ గొంతు కోసి చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.  

సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ 

ప్రస్తుతం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం రోహ్‌తక్ పీజీఐకి పంపారు. సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశానని సంప్లా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ విజేంద్ర సింగ్ తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో ఈ కేసు హత్యగా కనిపిస్తోందని ఆయన అన్నారు.  హిమాని నర్వాల్ హత్యపై ఎమ్మెల్యే బిబి బాత్రా అనుమానం వ్యక్తం చేస్తూ, ఆమె హత్యపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. 

హిమాని నర్వాల్ కాంగ్రెస్‌లో చురుకైన కార్యకర్త అని, పార్టీ ప్రతి కార్యక్రమంలో పాల్గొనేవారని ఆయన అన్నారు.  హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ హుడా మాట్లాడుతూ  ఈ సంఘటనపై ఉన్నత స్థాయి నిష్పాక్షిక దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబానికి వీలైనంత త్వరగా న్యాయం చేయాలని..  దోషులకు కఠినమైన శిక్ష విధించాలన్నారు.  హిమాని నర్వాల్ హత్య  రాష్ట్రంలో సంచలనంగా మారింది.  

Also Read :  65 లక్షల అప్పు కోసం వరుస హత్యలు...కేరళ మర్డర్స్ మిస్టరీ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు