Mallareddy AI Video: గాంధీ, అబ్దుల్ కలాంతో మల్లారెడ్డి భేటి.. సంచలన వీడియో

బీఆర్‌ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించి ఒక ఏఐ వీడియో వైరల్ అవుతుంది. అందులో ఆయన చాణిక్యుడు, బుద్దుడు, స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం వంటి ప్రముఖులతో మాట్లాడినట్లు కనిపిస్తుంది. మంచి విజ్ఞానం అందించాలని వారు మల్లారెడ్డికి సూచించారు.

New Update
Mallareddy AI Video

Mallareddy AI Video

మాజీ మంత్రి మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తన వ్యాఖ్యలతో ఎప్పటికప్పుడే వార్తల్లో నిలుస్తుంటారు. అందులో మాత్రమే కాకుండా తన డ్యాన్స్‌తో అలరించి బాగా వైరల్ అవుతుంటారు. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో ఆయన ట్రెండింగ్‌లోకి వచ్చారు. ఏకంగా దివంగత ప్రముఖులతో భేటి అయ్యారు. చాణిక్యుడు, బుద్దుడు, మదర్ థెరీసా, స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం వంటి ప్రముఖులతో ఆయన మాట్లాడినట్లు ఉన్న ఏఐ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

మల్లారెడ్డి ఏఐ వీడియో

వైరల్ గా మారిన ఏఐ వీడియోలో.. ముందుగా మల్లారెడ్డి టైం మెషిన్ అని చూపించారు. అందులో నుంచి ఆయన లోపలకి వెళి ప్రముఖులతో మాట్లాడినట్లు చూపించారు. ‘‘తిరుగులేని భవిష్యత్తునిచ్చే రోజులతో అద్భుతమైన విద్యాసంస్థలను స్థాపించు మల్లారెడ్డి అంటూ అందులో చెప్పడం చూడవచ్చు. అలాగే విజ్ఞానం పంచే విద్యాసంస్థలను స్థాపించు. రాజ్యాన్ని నిర్మించే విద్యావంతుల్ని తయారుచేయ్యు మల్లారెడ్డి. 

Also Read: పాకిస్తాన్ గేమ్ క్లోస్.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డిమాండ్ ఏంటంటే?

యువతను మేల్కొలుపు. వారిలో విజ్ఞానం వెలిగించు. విజ్ఞానం పంచే విద్యా సంస్థలను స్థాపించు. అద్భుతమైన టెక్నాలజీతో రేపటి సమాజాన్ని నిర్మించు మల్లారెడ్డి’’ అని చాణిక్యుడు, బుద్దుడు, మదర్ థెరీసా, స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం చెప్పడం చూడవచ్చు. దీంతో అక్కడ నుంచి బయటకు వచ్చిన మల్లారెడ్డి.. ‘‘మీ అందరి ఆశయాలను నెరవేరుస్తాను. దేశంలోనే అతి పెద్ద విశ్వవిద్యాలయ్యాన్ని నెలకొల్పుతాను. ఇది మల్లారెడ్డి మాట’’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. 

Advertisment
తాజా కథనాలు