జాతీయ చలనచిత్ర పురస్కారాలు సినీ పరిశ్రమలో అత్యంత గౌరవనీయమైన అవార్డులుగా పరిగణించబడతాయి. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్నిమన టాలీవుడ్ నుంచి రీసెంట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పాటూ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అందుకున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే.. వీళ్లకి ఈ అవార్డ్ వచ్చిన తర్వాత వివాదాల్లో ఇరుక్కున్నారు. మొదటి జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళాడు. ఇటీవలే బెయిల్ పై బయటికి వచ్చాడు. ఇటు అల్లు అర్జున్ సైతం సంధ్య థియేటర్ ఘటనలో అరెస్ట్ అయి తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. అల్లు అర్జున్ అరెస్ట్ గురించి అడగగానే జానీ మాస్టర్ ఎలా వెళ్లిపోయాడో చూడండి..pic.twitter.com/T2Ga3fhr8z — Narendra News (@Narendra4News) December 23, 2024 Also Read: Zelensky: 3000 మందికి పైగా ఉత్తర కొరియా సైనికులు చనిపోయి ఉండొచ్చు! అయితే తాజాగా ఇదే అంశంపై ఆర్టీవి ప్రతినిధి జానీ మాస్టర్‌ను ప్రశ్నించారు. 'మీకు మరియు అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు వచ్చిన తర్వాతే అరెస్ట్ అయ్యారు. దీని గురించి మీరేమంటారు?' అని విలేఖరి అడగ్గా.. అందుకు జానీ మాస్టర్ సమాధానం ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. అయితే జానీ మాస్టర్ బన్నీ అరెస్ట్ పై రియాక్ట్ అవ్వకుండా అక్కడినుంచి వెళ్లిపోవడంపై నెట్టింట పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 'పుష్ప2' షూటింగ్ టైం లోనే జానీ మాస్టర్ తన దగ్గర పనిచేసే లేడీ అసిస్టెంట్ తో తరచూ సెట్స్ కి వచ్చి గొడవలు పెట్టుకునేవాడని, ఆ గొడవల్ని అల్లు అర్జున్, సుకుమార్ సెటిల్ చేశారని కొన్ని రూమర్స్ ఉన్నాయి. Also Read: Dead Body Parcel Case: డెడ్‌బాడీ పార్శిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు అరెస్ట్! ఇప్పుడు జానీ మాస్టర్ బన్నీ అరెస్ట్ పై సైలెంట్ అవ్వడంతో.. అతను అల్లు అర్జున్, సుకుమార్ లకు భయపడి మాట్లాడలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు మాత్రం ఈ ఇష్యూను ఇంకా పెద్దది చేయడం ఇష్టం లేకే జానీ మాస్టర్ రియాక్ట్ అవ్వలేదని అంటున్నారు.