Allu arjun: సంధ్య థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ విచారణ ముగిసింది. 2 గంటలపాటు పోలీసుల బన్నీపై ప్రశ్నల వర్షం కురిపించారు. పోలీసులు అడిగిన కీలకమైన 50పైగా ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరి అయినట్లు తెలుస్తోంది. రేవతి చనిపోయిందని మీకు ముందే తెలుసు? మీకు రేవతి మరణ వార్త తరువాత రోజు తెలిసిందా? అనే ప్రశ్నకు కనీసం నోరు కూడా తెరవకుండా మౌనంగా ఉండిపోయిన బన్నీ.. రేవతి చనిపోయిన విషయం తర్వాత రోజే తెలిసిందని చెప్పాడు. CP, DCP మీకు ఆడిటోరియంలో కలిసారా? ఇక అలాగే తొక్కిసలాటకు సంబంధించిన 10 నిమిషాల వీడియోను అల్లు అర్జున్‌కు చూపించి పోలీసుల ఇంటరాగేషన్ చేయగా కాస్త గందరగోళానికి గురైనట్లు తెలుస్తోంది. ఇక మరికొన్ని ప్రశ్నలకు మాత్రం తడుముకోకుండా సమాధానం చెప్పిన అల్లు అర్జున్.. పలు కీలక ప్రశ్నలకు మాత్రం నోరు మెదపలేదని పోలీసులు తెలిపారు. CP, DCP మీకు ఆడిటోరియంలో కలిసారా? అనే ప్రశ్నకు.. వాళ్ళు ఎవరూ నన్ను కలవలేదు. మీడియాకి నాపై అవాస్తవాలు ప్రచారం చేసారని చెప్పినట్లు వెల్లడించారు. ఇది కూడా చదవండి.. తిరుపతిలో అపచారం..అన్నమయ్య విగ్రహానికి శాంటక్లాస్ టోపీ పెట్టిన దుండగులు తండ్రి, మామతో కలిసి ఒకే కారులో.. ఇదిలా ఉంటే.. ఏసీపీ రమేశ్, ఇన్‌స్పెక్టర్ రాజునాయక్ సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ ఆయన్ను వివిధ అంశాలపై విచారించారు. 2 గంటలుగా ఈ విచారణ కొనసాగింది. తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌కు పోలీసులు సోమవారం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం 11 గంటలకు పీఎస్‌లో విచారణకు రావాల్సిందిగా ఆదేశించగా దీంతో చిక్కడపల్లి పోలీసు స్టేషన్ కు మంగళవారం ఉదయం 10.30 గంటలకు హాజరయ్యాడు. ఒకే కారులో తన తండ్రి, నిర్మాత అల్లు అరవింద్‌తో చిక్కడపల్లికి వచ్చిన బన్నీతో అతని మామ చంద్రశేఖర్‌రెడ్డి, బన్నీ వాసు ఉన్నారు.