Tirumala: తిరుపతి భక్తులకు అలర్ట్.. దర్శనం పేరుతో మోసాలు

కొందరు దుండగులు శీఘ్ర దర్శనం పేరుతో తిరుమలలో భక్తులను మోసం చేస్తున్నారు. బంగారు నగలు ధరించి, ఒంటరి మహిళలను టార్గెట్ చేసి, మత్తు మందు ఇస్తున్నారు. వారి దగ్గర ఉన్న బంగారం అంతా కూడా దోచుకుని పారిపోతున్నారు. భక్తులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

New Update
Tirumala crime

Tirumala crime Photograph: (Tirumala crime)

ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా మోసాలు జరుగుతున్నాయి. ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానంలో తమిళనాడుకి చెందిన కొందరు దుండగలు తిరుమలలో మోసాలకు పాల్పడుతున్నారు. దర్శనం పేరుతో భక్తులను మోసం చేస్తున్నారు. సమయం సందర్భం లేకుండా కేవలం మహిళలను మాత్రమే టార్గెట్ చేస్తూ దుండగులు మోసాలకు పాల్పడుతున్నారు. తిరుపతిలో కొందరు ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటారు. మరికొందరు అక్కడికి వెళ్లిన తర్వాత టికెట్లు తీసుకుంటారు. అయితే ఇలాంటి భక్తులనే దుండగులు టార్గెట్ చేస్తున్నారు.

ఇది కూడా చూడండి:Horoscope Today: నేడు ఈ రాశి వారు అతిగా మాట్లాడకుండా ఉంటే బెటర్‌!

శీఘ్ర దర్శనం చేయిస్తామని మాయమాటలు చెప్పి..

శ్రీఘ్ర దర్శనం చేయిపిస్తామని, తక్కువ ధరకే అని భక్తులకు మోసం చేస్తున్నారు. ముఖ్యంగా ఎవరి ఒంటి మీద అయితే ఎక్కువ నగలు ఉంటాయో వారినే టార్గెట్ చేస్తున్నారు. నగలు వేసుకున్న మహిళలను టార్గెట్ చేసి జన సంచారం లేని ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. మెల్లిగా వెనకాల నుంచి మత్తు మందు ఇచ్చి దోచేస్తున్నారు. ఇలాంటి ఘటనలు తిరుపతిలో ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలా చేస్తున్న ముఠాను పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. మాయ మాటలు చెప్పి ఇలా చేసే వారిని నమ్మవద్దని, భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు. 

ఇది కూడా చూడండి:Russia-Trump: ఒప్పందం పై పుతిన్‌ అనుకూల వ్యాఖ్యలు..ఒకవేళ తిరస్కరిస్తే అంటున్న ట్రంప్‌!

తమిళనాడు రాష్ట్రంలోని విజయ్ కుమార్ (33), అతని పిన్ని ఆర్. శారద(65)లు దొంగల ముఠాగా ఏర్పడి ఆలయాల దగ్గర ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. వారి వద్ద ఉన్న ఉన్న బంగారంను దోచేస్తున్నారు. శీఘ్ర దర్శనం కల్పిస్తామని చెప్పి ఆమె దగ్గర ఉన్న విలువైన వాటిని దోచేశారు. కోలుకున్నాక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

ఇది కూడా చూడండి: Relation Tips: భయ్యా ఇలాంటి అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారో.. రోజూ నరకమే

Advertisment
తాజా కథనాలు