/rtv/media/media_files/2025/02/21/9gqJLVvZ8dNM8DkuxoE6.jpg)
horoscopee
మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలక విషయాల్లో అనుభవజ్ఞుల సలహాలు తప్పనిసరి. కళల పట్ల ఆసక్తి కనబరుస్తారు. పెద్దలను, గురువులను గౌరవించకపోయినట్లయితే నష్టపోవాల్సి వస్తుంది. మిమ్మల్ని తప్పుదారి పట్టించేవారితో, పోటీదారులతో అభిప్రాయబేధాలు ఏర్పడవచ్చు.
Also Read: Russia-Trump: ఒప్పందం పై పుతిన్ అనుకూల వ్యాఖ్యలు..ఒకవేళ తిరస్కరిస్తే అంటున్న ట్రంప్!
వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల అనారోగ్యం, కోర్టు వ్యవహారాలు ఒత్తిడికి గురి చేస్తాయి. స్థిర, చరాస్థుల కొనుగోళ్లు, అమ్మకాలు వాయిదా వేయడం మంచింది. నిరాశావాదాన్ని వీడి ఆశావాదులుగా ఉండండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృథా ఖర్చులు నివారిస్తే మంచిది.
Also Read: Train Hijack: రైలు హైజాక్ వెనుక భారత్ హస్తం.. పాక్ ఆరోపణలు
మిథునరాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగప్రయత్నాలలో ఉన్నవారు విజేతలవుతారు. మీ ప్రత్యర్థులు అపజయం పాలవుతారు. సాహసోపేతమైన నిర్ణయాలతో విజయం సాధిస్తారు.
కర్కాటకరాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో సమయానుకూలంగా ముందుకు సాగితే సత్ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధించాలంటే పట్టుదల అవసరం.
సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ పెరుగుతుంది. పట్టుదలతో ముందుకు సాగితే ప్రయోజనం ఉంటుంది. ఆర్థిక సమస్యలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. ఖర్చులు అదుపులో ఉంచుకోండి.
కన్యారాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. భావోద్వేగాలను అదుపు చేయడం కష్టమవుతుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు ఆశించిన స్థాయిలో ఉండవు. వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. ఖర్చులు అదుపులో పెట్టండి.
తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కష్టపడి పనిచేయాలి. స్వార్ధాన్ని వీడి పరోపకార గుణం పెంచుకుంటే మంచిది. ఎవరితోనూ అతిగా మాట్లాడవద్దు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. కీలక విషయాలు కుటుంబంతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి.
వృశ్చికరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో గొప్ప విజయాలు సాధిస్తారు. ఈ రోజు మీకు సాధ్యం కానిది అంటూ ఉండదు. దృఢ నిశ్చయానికి, ఆత్మ విశ్వాసానికి ప్రతిరూపంగా ఉంటారు.ఉద్యోగంలో, వ్యాపారంలో సమర్ధవంతమైన పనితీరుతో మంచి పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.
ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన పనుల్లో సమయపాలన అవసరం. సమాచార లోపం లేకుండా చూసుకోండి. ధార్మిక చింతనతో తీర్థయాత్రలకు వెళ్తారు. ఉద్యోగస్తులు సహోద్యోగుల సహకారంతో అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కొన్నాళ్లుగా ఇబ్బంది పెట్టిన సమస్యలు తొలగిపోతాయి. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం మీద అదనపు శ్రద్ధ పెట్టడం అవసరం. అనుకోని ఖర్చులు ఉండవచ్చు.
కుంభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. వ్యాపార భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి. మంచి లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతులు ఉంటాయి. అనవసర చర్చలు మానుకోండి.
మీనరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. కుటుంబంలో అశాంతి నెలకొంటుంది. జీవిత భాగస్వామితో మనస్పర్థలు విచారం కలిగిస్తాయి. ప్రాధాన్యత విషయాలు నిర్లక్ష్యం చేయకండి. ఓ వ్యవహారంలో డబ్బు నష్టం వాటిల్లుతుంది.
Also Read: BLA WARNING: యుద్ధం ఆగలేదు, భీకర పోరాటమే.. పాక్ ఆర్మీకి BLA స్ట్రాంగ్ వార్నింగ్!
Aslo Read: AP News: బీసీలకు సీఎం చంద్రబాబు అదిరిపోయే శుభవార్త.. ఒక్కొక్కరికీ రూ.20 వేలు..!