Cyber crime: ఒక్కసారి క్లిక్ చేశారో.. సెకన్లలో మీ అకౌంట్ ఖాళీ

తెలంగాణలో హీరేహాళ్ అనే వ్యక్తి అకౌంట్‌ నుంచి కేటుగాళ్లు రూ.9 లక్షలు కాజేశారు. అతని అకౌంట్‌లో డబ్బులు ఉన్నట్లు గుర్తించిన కేటుగాళ్లు వాట్సాప్‌లో ఓ మెసేజ్‌ను పంపారు. దాన్ని క్లిక్ చేయడంతో సెకన్ల సమయంలోనే మొత్తం డబ్బు కాజేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

New Update
cyber crime

ఈ మధ్య కాలంలో సైబర్ కేటుగాళ్ల ఆగడాలు పెరిగిపోయాయి. రిటైర్డ్ ఉద్యోగులు, వృద్దులు, సంపన్నులనే టార్గెట్ చేస్తున్నారు. బెదిరించి భయపెట్టి డబ్బులు గుంజేస్తున్నారు. ఎవరి అకౌంట్‌లో అయితే డబ్బులు ఉన్నాయో వారినే టార్గెట్ చేసి మోసానికి పాల్పడుతున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్లు ఓ మెసేజ్ పంపి అకౌంట్‌లో ఉన్న మొత్తం డబ్బును ఖాళీ చేయించారు.

ఇది కూడా చూడండి:  AP: ఏపీ నుంచి మరో కొత్త వందేభారత్ స్లీపర్ రైలు..ఏ రూట్లో అంటే!

డబ్బుపై కన్నేసి..

వివరాల్లోకి వెళ్తే.. గొడిశలపల్లి గ్రామానికి చెందిన హీరేహాళ్ హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ఇతనికి రాయదుర్గంలోని యూనియన్ బ్యాంక్‌లో అకౌంట్ ఉంది. ఇందులో దాదాపుగా రూ.9 లక్షల నగదు ఉన్నట్లు కేటుగాళ్లు గుర్తించారు. ఈ డబ్బుపై కన్నేసిన సైబర్ నేరగాళ్లు వాట్సాప్‌లో ఓ మెసేజ్‌ను బాధితుడికి పంపించారు.

ఇది కూడా చూడండి: Ap Rains: ఏపీని వదలని వరుణుడు..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

తెలియక ఆ మేసేజ్‌ను క్లిక్ చేయడంతో డబ్బులు కట్ అయ్యినట్లు మెసేజ్‌లు వచ్చాయి. ఆ రూ.9 లక్షలను ఐదు విడతలుగా సైబర్ నేరగాళ్లు వారి అకౌంట్‌లోకి పంపించుకున్నారు. వెంటనే బాధితుడు అప్రమత్తమై బ్యాంకు అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

ఇది కూడా చూడండి: Holidays: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..ఏకంగా 15 రోజుల పాటుసెలవులు

ఇది కూడా చూడండి: సౌత్‌ఇండియన్స్ వద్దంటూ జాబ్ నోటిఫికేషన్..తిట్టిపోస్తున్న నెటిజన్లు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు