అప్పు తీర్చలేక తెలంగాణలోని భూపాలపల్లిలో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ నిరుపేద కుటుంబం చేసిన చిన్న అప్పును తీర్చుకోలేక ఆత్మహత్య చేసుకుంది. పెంకుటిల్లు, రోజూ కష్టపడితేనే పూట గడవడం, కొన్ని పూటలు తిండి కూడా లేని రోజులు ఆ కుటుంబానివి. కష్టపడి ఇద్దరి పిల్లలను చదివించుకుంటూ.. చేసిన అప్పుకు వారానికి రూ.200 చెల్లించలేక తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఇది కూడా చూడండి: Musk: కొత్త సంవత్సర వేళ..పేరు మార్చుకున్న మస్క్..ఎంత వింతగా ఉందో చూడండి! డబ్బులు కట్టలేక.. వేధింపులు భరించలేక.. వివరాల్లోకి వెళ్తే.. వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ కమలాపూర్‌లో దేవేందర్, చందన దంపతులు జీవిస్తున్నారు. వీరి ఇద్దరి పిల్లలను ప్రభుత్వం స్కూల్‌లో చదివిస్తున్నారు. అయితే ఆ గ్రామంలో కొందరు మహిళలు ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారులు డబ్బులు అప్పు ఇస్తుంటారు. దీంతో చందన ఒక రూ.2.50 లక్షల వరకు తీసుకుంది. దీనికి వారానికి రూ.200 కట్టాలి. రోజూ వచ్చే కూలీలో నుంచి మొదట్లో సరిగ్గానే కట్టారు. కానీ ఆ తర్వాత పిల్లలు, చదువు, తిండితో పాటు అనారోగ్య సమస్యలు వచ్చాయి. ఇది కూడా చూడండి: Kadapa: న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం దీంతో ఆ దంపతులు కట్టలేకపోయారు. వీటికి తోడు అప్పుల వారి వేధింపులు భరించలేక భార్యాభర్తలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. వారానికి రూ.200 కట్టలేక చందన ఈ నెల 6వ తేదీన మందు తాగింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స తీసుకుంటూ మృతి చెందింది. భార్య చనిపోవడంతో భర్త కూడా ఈ నెల 20న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ప్రభుత్వం వీరిని ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఇది కూడా చూడండి: Horoscope 2025: కొత్త ఏడాదిలో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.. ఆ రాశుల లిస్ట్ ఇదే! ఇది కూడా చూడండి: AP: మద్యం దుకాణదారులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్