/rtv/media/media_files/2025/06/14/wdliqXh5yLqOc2I6f7Cu.jpg)
Crime
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాల దారుణం జరిగింది. ఓ తండ్రి తన ముగ్గురు కొడుకులతో కలిసి బైక్‌పై వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టింది(road accident). ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. తండ్రి, బాలుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను అభిరామ్ (9), రాము(5)గా గుర్తించారు. యాచారం మండలంలోని నాగార్జునసాగర్ రహదారిపై ఈ ఘటన జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.
Also Read: మహాగఠ్‌బంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వీ.. అధికారికంగా ప్రకటించిన గెహ్లాట్!
Road Accident In Rangareddy District
ఇదిలాఉండగా.. బీహార్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బెగుసరాయ్ జిల్లాలో నలుగురు రైలు పట్టాలు దాటుతుండగా వాళ్లని రైలు ఢీకొంది. దీంతో ఆ నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఓ మహిళ, ఆమె కూతురుతో పాటు మరో చిన్నారి, ఓ వ్యక్తి ఉన్నారు. బుధవారం రాత్రి ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
Also Read: గాల్లోనే ఇండిగో ఫ్లైట్ ఇంధన లీకేజీ.. గజగజ వణికిపోయిన 166 మంది ప్రయాణికులు
Follow Us