Rajasthan Man: సూదులతో రక్తం తీసి, గుండెను కోసి.. భార్య కోసం 6ఏళ్ల మేనల్లుడిని నరబలి ఇచ్చిన మామ..!

రాజస్తాన్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్య కోసం ఏకంగా 6ఏళ్ల మేనళ్లుడిని నరబలి ఇచ్చిన ఘటన సంచలనంగా మారింది. తన భార్య తిరిగి తనవద్దకు రావాలని మనోజ్ కుమార్ మాంత్రికుడిని కలిసాడు. అతడు ఒక చిన్నారిని నరబలి ఇవ్వాలని చెప్పడంతో మేనళ్లుడినే హతమార్చాడు.

New Update
Rajasthan Man Kills 6 Year Old Nephew

Rajasthan Man Kills 6 Year Old Nephew


భారతదేశం ఓ వైపు టెక్నాలజీ పరంగా దూసుకుపోతుంది. కానీ ఇప్పటికీ కొందరు మూఢ నమ్మకాలను వీడటం లేదు. అనారోగ్యంగా ఉన్నారని, ఇతరులపై పగ తీర్చుకోవాలని.. ఇలా ఇతర కారణాల చేత దొంగ బాబాలు, మాంత్రికులు చెప్పిన మాటలు విని చాలా దారుణాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో సొంత వారినే కడతేర్చుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. 

Also Read : పవిత్రమైన శ్రావణ మాసం.. ఈ పనులు చేశారో దరిద్ర దేవత మీ నెత్తిమీదే!

ఓ వ్యక్తి తన భార్య కోసం ఏకంగా సొంత మేనల్లుడినే నరబలి ఇచ్చాడు. సూదులతో రక్తం తీసి మాంత్రికుడికి అప్పజెప్పాడు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

భార్య కోసం మేనల్లుడి హత్య

రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా సారాయ్‌ కలాన్‌ గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడు లోకేష్ ఈ నెల అంటే జూలై 19వ తేదీన అదృశ్యమయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది.. ఆ రాత్రంతా వెతికారు. ఆ మరుసటి రోజు ఊరి చివర ఉన్న ఒక పాడుబడ్డ ఇంట్లో బాలుడు లోకేష్ డెడ్ బాడీ దొరికింది. ఆ డెడ్ బాడీ చూసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. బాలుడి శరీరం నిండా సూదులు గుచ్చిన ఆనవాళ్లు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. 

Also Read : ఖాళీ కడుపుతో మద్యం తాగడం మంచిదేనా? అందరూ చేసే తప్పే ఇది!

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో మృతుడు లోకేష్ మేనమామ మనోజ్ కుమార్‌ పై పోలీసులకు అనుమానం కలిగింది. అనంతరం జూలై 22న మేనమామ మనోజ్‌ను పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. అసలు నిజం బయటపడింది. పోలీసుల విచారణలో మనోజ్ కుమార్ సంచలన విషయాలు చెప్పాడు. 

మనోజ్ కుమార్, ఆయన భార్య గత కొంత కాలంగా గొడవలు పడుతున్నారు. ఈ క్రమంలోనే మనోజ్ భార్య తమ పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఎలాగైన తన భార్యను తన వద్దకు తెచ్చుకోవాలని.. మనోజ్ కుమార్.. సునీల్ అనే ఒక మాంత్రికుడిని కలిసి జరిగిన విషయం చెప్పాడు. దీంతో నరబలి ఇస్తే భార్య తిరిగి వస్తుందని మాంత్రికుడు సునీల్ చెప్పాడు. పూజల కోసం రూ.12 వేలు, చిన్నారి రక్తం, గుండె కావాలని మాంత్రికుడు తెలిపాడు. 

Also Read : తిరుపతిలో కన్ను తెరిచిన శివయ్య.. గతంలో ఇలాంటి ఘటనలు ఎక్కడెక్కడ జరిగాయో తెలుసా?

దీంతో మనోజ్ కుమార్ ఈ తంతు కోసం తన మేనల్లుడినే ఎంచుకున్నాడు. దీంతో జూలై 19న చాక్లెట్ ఇస్తానని ఆశచూపి.. బాలుడు లోకేష్‌ను పాడు బడ్డ ఇంట్లోకి తీసుకెళ్లాడు. అక్కడ లోకేష్ గొంతునులిమి హత్య చేశాడు. ఆపై సిరంజీలతో రక్తం తీసి మాంత్రికుడికి అందించాడు. ఆ తర్వాత గుండె తీసేందుకు మరోసారి డెడ్ బాడీ వద్దకు వచ్చినట్లు పోలీసులు సీసీఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. దీంతో మేనమామ మనోజ్, మాంత్రికుడు సునీల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

Also Read : ఏపీలో విషాదం.. ప్రియుడి ఇంటిముందు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ప్రియురాలు

Advertisment
తాజా కథనాలు