/rtv/media/media_files/2025/03/03/6Os7gN3Im001SyWUxAJ0.jpg)
97 వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజెలెస్ లోని డాల్బీ థియేటర్‌లో ఘనంగా జరుగుతున్నాయి. హాస్యనటుడు కోనన్ ఓ'బ్రెయిన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ వేడుకలకు హాలీవుడ్ రంగంలోని వివిధ రంగాలకు చెందిన సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సినిమా రంగంలో ఆస్కార్ అవార్డును అత్యున్నత అవార్డుగా పరిగణిస్తారు. ఈ ఆస్కార్ అందుకోవాలనేది ప్రతి ఒక్క నటుడికి, ప్రతీ టెక్నీషియన్ కలగా ఉంటుంది.
🔴📽️ #DIRECTE | I l'Oscar a millor cançó original ha estat pel El mal d'Emilia Pérez. Segon Oscar per la pel·lícula francesa (i en cap dels discursos d'agraïment s'ha citat a Karla Sofía Gascón) #Oscars2025 https://t.co/whs9p27frY
— ElNacional.cat (@elnacionalcat) March 3, 2025
హాలీవుడ్ నటి జోసల్దానా 'ఎమీలియా పెరెజ్' సినిమాకు గాను బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డును గెలుచుకున్నారు. ఆమెకు ఇదే తొలి ఆస్కార్ కావడంతో స్టేజీపై ఎమోషనల్ అయ్యారు. అవతార్, అవెంజర్స్-ఎండ్ గేమ్ వంటి సినిమాలతో ఆమె పాపులర్ అయ్యారు.
#Oscars | ¡#EmiliaPérez suma su segundo premio de la noche. Se lleva la estatuilla a Mejor canción original con 'El mal'. Entrega la estatuilla el legendario Mick Jagger. #Oscars2025 pic.twitter.com/rFk3VUbZO4
— SieteDíasOaxaca (@sietediasoaxaca) March 3, 2025
విజేతలు వీళ్లే!
ఉత్తమ సహాయ నటుడు - కీరన్ కైల్ కల్కిన్ (ది రియల్ పెయిన్)
ఉత్తమ సహా నటి - జోయా సాల్దానా (ఎమిలియా పెరెజ్)
ఒరిజినల్ సాంగ్ - ఎల్ మాల్ (ఎమిలియా పెరెజ్)
ఉత్తమ స్క్రీన్‌ప్లే - అనోరా (సీన్ బేకర్)
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే - కాన్‌క్లేవ్ (పీటర్ స్ట్రాగన్)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ - వికెడ్ (పాల్ తేజ్‌వెల్)
యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ - ఫ్లో
ఉత్తమ యానిమేటెడ్ షార్ట్‌ఫిల్మ్ - ఇన్ ది షాడో ఆఫ్ ది సైప్రెస్
ఉత్తమ మేకప్, హెయిల్‌స్టైల్ - ది సబ్‌స్టాన్స్
ఉత్తమ ఎడిటింగ్ - అనోరా (సీన్ బేకర్)
Also read : Oscars 2025: అందరూ చూస్తుండగానే అతడిని ముద్దు పెట్టుకుంది.. ఇది రెండో సారి!!