Oscars 2025: 22 ఏళ్ల తర్వాత అదే ముద్దు.. ఆస్కార్ వేడుకపై అద్భుతమైన దృశ్యం!

2025 ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో హాలివుడ్ హీరో హీరోయిన్‌ను అందరూ చూస్తుండగానే ముద్దు పెట్టుకున్నాడు. అడ్రియన్ బ్రాడీ, హాలీ బెర్రీని కిస్ చేశాడు. 2003 ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్‌లో కూడా వీరిద్దరూ ఇలానే ముద్దుపెట్టుకోగా ఆ విషయం కాంట్రవర్షియల్ అయ్యింది.

New Update
oscar 2025

oscar 2025

Oscars 2025: చిత్రపరిశ్రమలోనే అతిపెద్ద అవార్డుల పండుగ 97వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం అమెరికా లాస్‌ ఏంజెల్స్‌లో జరుగుతుంది. వేడుకల్లో ఓ హలీవుడ్ హీరో చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు. హీరోయిన్‌ను అందరూ చూస్తుండగానే, కెమెరాల ముందే ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

చర్చనీంశమైన వింత ప్రవర్తన..

2003 ఆస్కార్ అవార్డుల టైంలో కూడా వారు ఇలాగే చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. అప్పుడు వారి వింత ప్రవర్తన చర్చనీంశమై వైరల్‌గా మారింది. 2003 అకాడమీ అవార్డ్స్ ఫంక్షన్‌లో ది పియానిస్ట్ చిత్రానికి ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్న బ్రాడీ, హాలీ బెర్రీని స్టేజ్ మీదే కిస్ చేశాడు. బ్రాడీ, హాలీ బెర్రీ సీన్ సంచలనంగా మారింది. 

Also read : Blue Ghost : చంద్రుడిపైకి దారులు.. మూన్‌పై సేఫ్‌గా ల్యాండైన ఫస్ట్ ప్రైవేట్ శాటిలైట్ ఇదే

2025 అవార్డుల్లో కూడా వీరు నామినేట్ అయ్యారు. ఆదివారం లాస్‌ఏంజెల్స్‌లో వీరు ఆస్కార్ అవార్డ్  ఫంక్షన్‌కు వచ్చారు. మీడియాతో మాట్లాడుతున్న అడ్రియన్ బ్రాడీ దగ్గరకు ఆమె రాగానే ఇద్దరు ముద్దు పెట్టుకున్నారు. అక్కడున్న వారంతా అది చూసి కేరింతలు వేశారు. చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేశారు. 22 ఏళ్ల తర్వాత 2003లో కాంట్రవర్సీ అయిన ముద్ద సీన్‌ను అడ్రియన్ బ్రాడీ, హాలీ బెర్రీలు రీక్రియేట్ చేశారు.

Also read :  Group Exams Results: గ్రూప్స్ అభ్యర్థులకు అలెర్ట్‌.. ఫలితాలపై కీలక అప్‌డేట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు