వీడు అన్న కాదు నరరూప రాక్షసుడు.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చెల్లిని చంపి.. ఏపీలో దారుణం!

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత చెల్లిని హత్య చేసిన దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. కత్తితో చెల్లిని పొడిచి చంపి.. ఆపై రోడ్డు ప్రమాదంగా క్రియేట్ చేశాడు. పోలీసులకు అనుమానం వచ్చి దర్యాప్తు చేపట్టగా విషయం వెలుగులోకి వచ్చింది.

New Update
attack

prakasam

అన్నా చెల్లెల బంధం ఎంతో వెలకట్టలేనిది. ఒక అన్న.. చెల్లికి ఎలాంటి ఆపద రాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. అలాంటిది ఆ అన్న చెల్లికి ఆపద కలిగించిన దారుణ ఘటన ప్రకాశంలో చోటుచేసుకుంది. డబ్బులు కోసం సొంత చెల్లిని కిరాతకంగా ఓ రాక్షస అన్న చంపాడు. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా పొదిలి మండలం కాటూరివారిపాలెంలో అశోక్ రెడ్డి అనే ఓ యువకుడు ఉన్నాడు.

ఇది కూడా చూడండి: Maha Kumbh Mela :  మహా కుంభమేళాలో తొక్కిసలాట.. అమృత స్నానాలపై అఖండ పరిషత్‌ కీలక నిర్ణయం

ఎక్కువ సార్లు అడగడంతో పోలీసులకు అనుమానం వచ్చి..

ఇతనికి సంధ్యా అనే చెల్లి కూడా ఉంది. అయితే ఈమె పేరుపై ఇతను కోటి ఇరవై లక్షలకుపైగా ఇన్సూరెన్స్ చేయించాడు. ఆ తర్వాత ఆమెను సోదరుడు కిరాతకంగా హత్య చేశాడు. ఏమీ తెలియనట్లు తన చెల్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లి చూస్తే అక్కడ ఎలాంటి ఆనవాళ్లు కూడా కనిపించలేదు. రోడ్డు ప్రమాదమని.. కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్ కాపీ ఇవ్వాలని అశోక్ పోలీసులను అడిగాడు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి దర్యాప్తు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది.

ఇది కూడా చూడండి: Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి విదేశయాన ప్రయత్నాలు సులభం అవుతాయి..!

ఇటీవల సంధ్యపై రూ.కోటి ఇరవై లక్షలకు టర్మ్ పాలసీ తీసుకున్నాడు. ఈ ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ఆమెను కత్తితో పొడిచి చంపాడు. ఆ తర్వాత రోడ్డు ప్రమాదం అని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి అశోక్‌ను అరెస్టు చేశారు. జీవితాంతం చెల్లిని కంటికి రెప్పలా కాపాడాల్సిన అన్న ఇలా చేయడంతో తల్లిదండ్రులు రోధిస్తున్నారు. కొడుకు ఇంతటి దారుణానికి పాల్పడటంతో తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. 

ఇది కూడా చూడండి: Big Breaking: కుంభమేళాలో తొక్కిసలాట ..17 మంది మృతి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు