Khajana Jewelry: ఖజానా జ్యువెలరీలో చోరీ చేసింది వీరే.. కేసు ఛేదించిన పోలీసులు

హైదరాబాద్‌ చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీ దోపిడీ సంచలనం సృష్టించింది. ఈ కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను అదుపులోకి తీసుకొని వారి నుంచి నాటు తుపాకులు, బులెట్లు స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్‌ డీసీపీ వినీత్‌ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.

New Update
Khajana Jewellery

Khajana Jewellery

హైదరాబాద్‌(Hyderabad) చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీ(Khajana Jewelry) దోపిడీ సంచలనం సృష్టించింది. ఈ కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను అదుపులోకి తీసుకొని వారి నుంచి నాటు తుపాకులు, బులెట్లు స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్‌ డీసీపీ వినీత్‌ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. నిందితులు ఖజానా జ్యువెలరీ వద్ద 20 రోజులు రెక్కీ నిర్వహించినట్లు తెలిపారు. దోపిడీకి మొత్తం ఏడుగురు వ్యక్తులు వచ్చినట్లు పేర్కొన్నారు.

Also Read :  TPCC సంచలన వ్యాఖ్యలు.. క్రమశిక్షణ కమిటీకి చేరిన రాజగోపాల్‌ రెడ్డి వ్యవహారం

Robbery At Khajana Jewelry

బైకులపై వచ్చి దోపిడీ చేసి, మళ్లీ బైకులపైనే పరారయ్యారని డీసీపీ వినీత్‌ తెలిపారు. నకిలీ నంబర్‌ ప్లేట్లతో వచ్చి చోరీకి పాల్పడి.. ఆ తర్వాత వాటిని మార్చుకున్నారట. హైదరాబాద్ నగర శివారులో భద్రతాసిబ్బంది ఎక్కువగా లేని దుకాణాన్ని ఎంచుకొని దోపిడీకి పాల్పడ్డారు. 10 కిలోల వెండి ఆభరణాలు, వస్తువులతో పరారయ్యారు. ఈ ముఠా గతంలో కోల్‌కతా, బిహార్‌, కర్ణాటకలో దోపిడీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

Also Read :  పల్సర్‌ బైక్‌ కొనివ్వలేదని .. కన్నతండ్రిపైనే కొడుకు హ*త్యాయత్నం

రెండేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. ఈ బిహార్‌ ముఠా హైదరాబాద్‌లో చేసిన తొలి చోరీ ఇది. ఇతర రాష్ట్రాల కూలీలను నియమించుకునేవాళ్లు జాగ్రత్తగా ఉండాలి. కూలీలకు ఏమైనా నేర చరిత్ర ఉందా? అని ఆరా తీయాలి. లేబర్‌ సప్లయ్‌ ఏజెన్సీలు తమ వద్దకు వస్తున్న వారి వివరాలు మాకు ఇస్తే బాగుంటుంది’’ అని వినీత్‌ తెలిపారు.

పరారీలో ఉన్న మిగతా ఐదుగురు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ముఠాపై గతంలో బీహార్, కోల్‌కతా, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా హత్యలు, అత్యాచారాలు, దోపిడీలతో సహా పలు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ దోపిడీ ఘటన తర్వాత పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు.

Advertisment
తాజా కథనాలు