Zomato: జొమాటో యూజర్లకు బిగ్ షాక్.. ఒక్కో ఆర్డర్‌పై భారీగా పెంచిన ఫీజులు!

గతంలో జొమాటో ప్రతి ఆర్డర్‌పై రూ.10 వసూలు చేయగా ఇప్పుడు దాన్ని రూ.12లకు పెంచింది. దేశంలో జొమాటో సేవలు అందుబాటులో ఉన్న అన్ని నగరాల్లో కూడా ఈ పెంపు వర్తిస్తుంది. తక్కువ ధర లేదా ఎక్కువ ధర వస్తువు ఆర్డర్ చేసినప్పుడు అదనంగా తప్పకుండా రూ.2 చెల్లించాల్సిందే.

New Update
Zomato

Zomato

ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ అయిన జొమాటో యూజర్లకు బిగ్ షాకిచ్చింది. ఫ్లాట్‌ఫామ్ ఫీజు(Zomato increased platform fees) ను పెంచుతూ జొమాటో కీలక ప్రకటన చేసింది. గతంలో ప్రతి ఆర్డర్‌పై రూ.10 వసూలు చేయగా ఇప్పుడు దాన్ని రూ.12లకు పెంచింది. దేశంలో జొమాటో సేవలు అందుబాటులో ఉన్న అన్ని నగరాల్లో కూడా ఈ పెంపు వర్తిస్తుంది. తక్కువ ధర లేదా ఎక్కువ ధర వస్తువు ఆర్డర్ చేసినప్పుడు అదనంగా తప్పకుండా రూ.2 చెల్లించాలి. అయితే జొమాటో ఈ ఫీజులను పెంచడానికి గల కారణాలను అయితే తెలపలేదు. పండగలు రావడంతో ఆర్డర్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో డెలివరీ సిబ్బందికి ఎక్కువగా జీతాలు ఇవ్వాల్సి ఉండటంతో పెంచినట్లు తెలుస్తోంది. అలాగే యాప్‌ను మెరుగుపరచడంతో పాటు డెలివరీ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి ఎక్కువగా ఖర్చు అవుతుంది. వీటిని భర్తీ చేయడానికి జొమాటో ఫీజులు పెంచినట్లు తెలుస్తోంది. గతేడాది కూడా జొమాటో పండగ సీజన్‌(Festival Season) లో ఫ్లాట్‌ఫామ్ ఫీజును రూ.6 నుంచి రూ.10 కి పెంచింది. ఆ తర్వాత ఆ ఫీజును తగ్గించకుండా అలాగే పెంచింది. ఇప్పుడు మళ్లీ ఫీజును పెంచింది. 

ఇది కూడా చూడండి: Money Investment: తక్కువ జీతమా అయినా పర్లేదు.. నెలకు రూ.1000 చొప్పున పెట్టుబడి పెడితే మీరే ధనవంతుడు!

పండగ సమయాల్లో భారీ డిమాండ్ వల్ల..

జొమాటో(Zomato) మాదిరిగానే స్విగ్గీ(Swiggy) కూడా ప్లాట్‌ఫామ్ ఫీజును ఇటీవల పెంచింది. అయితే స్విగ్గీ ఫ్లాట్‌ఫామ్ ఫీజును కొన్ని నగరాల్లో మాత్రమే ఎంపిక చేసింది. ఆ నగరాల్లో రూ.12 నుంచి రూ.14కు ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచింది. ఈ ఫీజు పెంపు కూడా ప్రధానంగా పండగ సమయాల్లో డిమాండ్ ఎక్కువగా ఉండటం, నిర్వహణ ఖర్చులను భరించడం కోసమేనని తెలిపింది. స్విగ్గీ కూడా ఈ పెంపు వల్ల ప్రతి ఆర్డర్‌పైనా అదనంగా రూ. 2 లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేస్తుంది. ఈ కంపెనీలు ఇలా ఫీజులు పెంచడం వల్ల వినియోగదారులకు పెద్దగా భారం అనిపించకపోవచ్చు. ఒక ఆర్డర్‌పై రూ. 2 లేదా రూ. 4 అదనంగా చెల్లించడం చాలా చిన్న మొత్తంగా కనిపిస్తుంది. కానీ పెద్ద కంపెనీలకు ఎన్నో ఆర్డర్లు వస్తాయి. వీటివల్ల వారికి భారీ మొత్తంలో లాభం వస్తుంది. ఒక్క రోజులో జొమాటో 10 లక్షల ఆర్డర్లు డెలివరీ చేస్తే, ఒక్కో ఆర్డర్‌పై రూ. 2 అదనంగా వసూలు చేయడం వల్ల ఆ రోజు కంపెనీకి అదనంగా రూ. 20 లక్షల ఆదాయం వస్తుంది. నెలకు ఇది రూ. 6 కోట్ల వరకు ఉంటుంది. ఇది కేవలం ప్లాట్‌ఫామ్ ఫీజు ద్వారా వచ్చే అదనపు ఆదాయం మాత్రమే. ఈ విధంగా చూస్తే వినియోగదారులకు చిన్న మొత్తంగా కనిపించే ఈ పెంపు కంపెనీలకు భారీగా లాభాలను తీసుకొస్తుంది. 

ఇది కూడా చూడండి: Stock Market: పెరిగిన జీడీపీ..లాభాల్లో స్టాక్ మార్కెట్ పరుగులు

Advertisment
తాజా కథనాలు