గుంటూరు రూరల్ రెడ్డిపాలెంలో క్షుద్రపూజల కలకలం రేపాయి. రెడ్డిపాలెం శివాలయంలో క్షుద్రపూజలు నిర్వహించాడు అఘోరా శ్రీనివాస్. అతనికి అఘోరీ శాలిని కూడా సహకరించింది. చంద్రగ్రహణం రోజునే అఘోరా శ్రీనివాస్ క్షుద్రపూజలు నిర్వహించడంతో రెడ్డిపాలెం గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. శివాలయం పక్కనే శ్రీనివాస్, శాలిని ఇంట్లో నివాసం ఉంటున్నారు. గ్రామ శ్రేయస్సు కోసమే చంద్ర గ్రహణం రోజు పూజ చేశామని వీరు అంటున్నారు. ఈ ఘటనపై గ్రామస్తుల ఆందోళన చేపట్టారు. అఘోరా ఊరు విడిచి వెళ్లాలంటూ ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు శ్రీనివాస్, శాలినిని అరెస్టు చేశారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
Aghora Puja : అమరావతిలో క్షుద్ర పూజలు.. అఘోరీ ఏం చేశాడంటే?
గుంటూరు రూరల్ రెడ్డిపాలెంలో క్షుద్రపూజల కలకలం రేపాయి. రెడ్డిపాలెం శివాలయంలో క్షుద్రపూజలు నిర్వహించాడు అఘోరా శ్రీనివాస్. అతనికి అఘోరీ శాలిని కూడా సహకరించింది.
New Update
తాజా కథనాలు