/rtv/media/media_files/2025/02/24/MWUtmeDpKYE94o5xBfPz.jpg)
sridevi death anniversary
Sridevi: అతిలోక సుందరి శ్రీదేవి మరణం సినీ ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచింది. దుబాయ్ హోటల్‌లోని బాత్‌టబ్‌లో ఆమె అనూహ్య మృతి, ఇప్పటికీ అనేక ప్రశ్నలకు సమాధానంగా నిలిచింది. ఆ రాత్రి జరిగిన సంఘటనలు, ఆమె చివరి క్షణాలు, ఇంకా మిస్టరీగా మిగిలిపోయాయి. ఈరోజు శ్రీదేవి వర్ధంతి సందర్భంగా ఆమె సినీ కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలను మరోసారి గుర్తుచేసుకుందాం..
అగ్రశ్రేణి కథానాయికగా
నాలుగేళ్ళ వయసులోనే బాలనటిగా సినీ కెరీర్ ప్రారంభించిన శ్రీదేవి.. తన నటన నైపుణ్యం, అందంతో దశాబ్దాల పాటు తెలుగు సినీ రంగంలోనే అగ్రశ్రేణి కథానాయకిగా కొనసాగింది. దాదాపు అందరు అగ్ర కథానాయకులతో కలసి నటించింది. కొండవీటి సింహం, వేటగాడు, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి, ముద్దుల కొడుకు, ప్రేమాభిషేకం, బంగారు కానుక, ప్రేమకానుక వంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. కమల్ హాసన్, రజినీకాంత్ వంటి కోలీవుడ్ స్టార్లతో కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఓ పక్క తెలుగు సినిమాలు చేస్తూనే హిందీ సినీ రంగంలో అడుగుపెట్టారు. అక్కడ కూడా స్టార్ హీరోయిన్ గా తన ముద్ర వేసుకుంది అతిలోక సుందరి. 1997 'జుదాయి' చిత్రం తర్వాత ఆమె వెండితెరకు దూరమయ్యారు. ఆ తర్వాత బోనీ కపూర్ ని వివాహమాడారు. పెళ్ళైన తర్వాత కూడా కొన్నేళ్ళ పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.
/rtv/media/media_files/2025/02/24/VSlIHGN6NmYW7pIDYCBb.png)
శ్రీదేవి మరణం మిస్టరీగానే
2018 ఫిబ్రవరి 24న దుబాయ్ హోటల్‌లోని బాత్‌టబ్‌లో శ్రీదేవి హటాత్త్మరణం యావత్ సినీ లోకాన్ని షాక్ కి గురిచేసింది. ఆమె లేని భాదను అభిమానులు ఇప్పటికీ అనుభవిస్తున్నారు. ఇప్పటికీ శ్రీదేవి మరణంపై అభిమానుల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆమె మృతి వెనుక ఒక్కొక్కరు ఒక్కో రీజన్ చెబుతారు. శ్రీదేవి కఠినమైన ఆహారం నియమాలు ఆమె మరణానికి కారణమని కొందరు అంటారు. మరికొందరు మరికొందరు శ్రీదేవి మరణం వెనుక ఆమె భర్త బోనీ కపూర్ హస్తం ఉందని అంటారు. కానీ ఈ ఆరోపణలను సంబంధించి ఎంక్వైరీ జరిపిన ముంబై పోలీసులు బోనీ కపూర్ కి క్లీన్ చిట్ ఇచ్చారు.
/rtv/media/media_files/2025/02/24/obcL341zdF9txLjdN4kX.png)
గతంలో ఓ ఇంటర్వ్యూలో భార్య శ్రీదేవి మరణం పై స్పందించిన బోనీ కపూర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. "శ్రీదేవి తన రూపం, అందం ఫై ప్రత్యేక శ్రద్ధ వహించేది. అదే ఆమెకు శాపంగా మారింది. ఆమె భోజనంలో అసలు ఉప్పు ఉండదు. ఉప్పు లేని ఆహరం ఎక్కువగా తీసుకోవద్దని శ్రీదేవికి వైద్యులు వార్నింగ్ ఇచ్చారు. కానీ ఆమె ఆ విషయాన్ని పట్టించుకోలేదు. క్రాష్ డైట్ లు ఎక్కువగా పాటించేది. ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఆమె పాటించే ఆహార నియమాలు ఆందోళన కలింగించేవి. అలా చేయడం వల్ల ఆమె ఆరోగ్యం దెబ్బతింది అని తెలిపారు. " ఏదేమైనా ఆమె మరణం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.
Also Read: Maha Shivratri 2025: మహాశివరాత్రి రోజున ఈ పనులు ఖచ్చితంగా చేయండి? అన్ని శుభాలే