NEET Student: ఫాస్ట్ ఫుడ్ తిని విద్యార్థిని మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నీట్‌కు సిద్ధమవుతున్న ఇల్మా(17) అనే విద్యార్థిని ఫాస్ట్‌ఫుడ్‌ తిని అస్వస్థకు గురై మరణించడం కలకలం రేపింది.

New Update
NEET student dies in Uttarpradesh after eating fast food

NEET student dies in Uttarpradesh after eating fast food

ఉత్తర్‌ప్రదేశ్‌(uttarpradesh) లోని అమ్రోహా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నీట్‌కు సిద్ధమవుతున్న ఇల్మా(17) అనే నీట్‌ విద్యార్థిని ఫాస్ట్‌ఫుడ్‌(fastfood) తిని అస్వస్థకు గురై మరణించడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే ఇల్మాకు నెల రోజుల క్రితం జ్వరం వచ్చింది. మొదటగా ఆమెను నోయిడా ఆస్పత్రిలో చూపించారు. ఆ తర్వాత డిసెంబర్‌ 22న ఢిల్లీకి తరలించారు. ఆమె మెదడులో 25 తిత్తులు ఉన్నాయని గుర్తించిన వైద్యులు సర్జరీ చేశారు. 

Also read: సిగరెట్‌, పాన్‌ మసాలాపై 40 శాతం జీఎస్టీ.. ఎప్పటినుంచంటే ?

NEET Student Dies After Eating Fast Food

అయినప్పటికీ డిసెంబర్ 29న ఆమె ప్రాణాలు కోల్పోయింది.  ఇల్మా తిన్న ఫాస్ట్‌ఫుడ్‌లోని క్యాబేజీలో ఉన్న పురుగులు ఆమె శరీరంలోకి ప్రవేశించాయని వైద్యులు తెలిపారు. ఆ తర్వాత అవి మెదడులో తిత్తులుగా ఏర్పడ్డాయని చెప్పారు. అయితే క్యాబేజీ వంటి పచ్చి కూరగాయలు సరిగ్గా శుభ్రం చేయకుండా, పూర్తిగా ఉడకబెట్టకుండా వండితే ఇలాంటి ప్రమాదం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.    

Also Read: న్యూఇయర్‌ వేళ బిగ్ షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు

Advertisment
తాజా కథనాలు