Smart Watch: కిడ్నాపర్లను పట్టించిన స్మార్ట్‌వాచ్.. చిన్న తప్పుతో అందరూ జైలులోకి

సినిమాల్లో కనిపించే విధంగా ఓ యువకుడు తన చాకచక్యంతో కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్నాడు. విచిత్రమేమిటంటే, తనను కిడ్నాప్ చేసిన వ్యక్తి స్మార్ట్‌వాచ్‌ను ఉపయోగించి తన సమాచారాన్ని పంపి ప్రాణాలతో బయటపడ్డాడు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

New Update
kidnap

సినిమాల్లో కనిపించే విధంగా ఓ యువకుడు తన చాకచక్యంతో కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్నాడు. విచిత్రమేమిటంటే, తనను కిడ్నాప్ చేసిన వ్యక్తి స్మార్ట్‌వాచ్‌ను ఉపయోగించి తన సమాచారాన్ని పంపి ప్రాణాలతో బయటపడ్డాడు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో జరిగిన ఈ ఆసక్తికర ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. - madya-pradesh-high-court

Also Read :  అసలు లక్ష, వడ్డీ రూ.73 లక్షలు.. కిడ్నీ అమ్మి అప్పు తీర్చిన రైతు

అసలు జరిగిందిదే!

హరిద్వార్‌లోని ఓ హోటల్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న సౌరభ్ శర్మ(25) సెలవుల కోసం గ్వాలియర్‌లోని తన ఇంటికి వచ్చాడు. సౌరభ్ గతంలో స్థానిక వడ్డీ వ్యాపారులైన హేమంత్ శర్మ (చోటూ త్యాగి), సచిన్ త్యాగి వద్ద రూ.2.90 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. తన కష్టార్జితంతో ఇప్పటికే రూ.3.20 లక్షలు తిరిగి చెల్లించినప్పటికీ, నిందితులు చక్రవడ్డీ పేరిట మరో రూ.6 లక్షలు కావాలని వేధించడం ప్రారంభించారు.

గత సోమవారం సాయంత్రం సౌరభ్ ఇంటికి నిందితులు బైక్‌పై వచ్చి అతడిని కిడ్నాప్ చేశారు. సచిన్ త్యాగి అనే నిందితుడి ఇంట్లోని ఓ గదిలో సౌరభ్‌ను బంధించి, విపరీతంగా దాడి చేశారు. డబ్బు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. 

Also Read :  బర్త్ డే పార్టీ.. దువ్వాడ జంటకు మరోషాక్‌...ఆయనకు నోటీసులు

స్మార్ట్‌వాచ్‌తో రెస్క్యూ ప్లాన్

నిందితులు దాడి చేసిన తర్వాత సౌరభ్‌ను గదిలో ఒంటరిగా వదిలి వెళ్లారు. ఆ సమయంలో గదిలో నిందితుడు మర్చిపోయిన స్మార్ట్‌వాచ్‌(smart-watch) ను సౌరభ్ గమనించాడు. తన ఫోన్‌ను కిడ్నాపర్లు లాగేసుకున్నప్పటికీ, ఆ స్మార్ట్‌వాచ్ సహాయంతో వెంటనే తన గర్ల్‌ఫ్రెండ్‌కు కాల్ చేసి పరిస్థితిని వివరించాడు. తన లొకేషన్‌ను కూడా ఆమెకు తెలియజేశాడు. వెంటనే స్పందించిన ఆమె, సౌరభ్ తండ్రికి సమాచారం అందించింది. సౌరభ్ తండ్రి నేరుగా పోలీసులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు. మొదట నిందితుడు హేమంత్ శర్మను అదుపులోకి తీసుకుని ఒత్తిడి చేయడంతో, సచిన్ త్యాగి భయపడి సౌరభ్‌ను విడిచిపెట్టాడు.

పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారిపై అక్రమ వడ్డీ వ్యాపారం, కిడ్నాప్ కేసులు నమోదు చేశారు. టెక్నాలజీని సరైన సమయంలో ఉపయోగించి సౌరభ్ తన ప్రాణాలను కాపాడుకోవడంపై పోలీసులు సైతం ప్రశంసలు కురిపించారు. కిడ్నాప్ జరిగిన కొద్ది గంటల్లోనే కేసు సుఖాంతం కావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisment
తాజా కథనాలు