Gurumurthy Case: గురుమూర్తి కేసులో బిగ్ ట్విస్ట్.. DNA టెస్టులో బయటపడిన సంచలనాలు!

మీర్‌పేట్ గురుమూర్తి భార్య మాధవి మర్డర్ కేసు కీలక మలుపు తిరుగుతోంది. గురుమూర్తి ఇంట్లో సేకరించిన నమూనాలపై DNA పరీక్షలు నిర్వహించగా సంచలనాలు బయటపడ్డాయి. ఇంట్లో గోడపై రక్తపు మరకలు, డోర్‌మ్యాట్‌పై మహిళల అడుగులున్నట్లు ఫోరెన్సిక్ బృందం ధృవీకరించింది. 

New Update

Gurumurthy Case: హైదరాబాద్ మీర్‌పేట్ గురుమూర్తి భార్య పుట్టా వెంకట మాధవి మర్డర్ కేసులో మరిన్ని సంచలనాలు బయటపడ్డాయి. ఈ దారుణమైన హత్యపై దర్యాప్తు చేపట్టిన ఫోరెన్సిక్ బృందం.. నేరం జరిగిన ప్రదేశంలో గోడపై రక్తపు మరకలు, డోర్‌మ్యాట్‌పై మహిళల అడుగులున్నట్లు ధృవీకరించింది. ఈ మేరకు తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (TGFSL), మీర్‌పేట పోలీసులు గురుమూర్తి నివాసం నుంచి సేకరించిన నమూనాలపై గురువారం DNA పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ జి పాండు పర్యవేక్షణలో DNA పరీక్షలు జరపగా.. మాధవి తల్లిదండ్రులు లేదా పిల్లల DNA నమూనాలను కోర్టు ద్వారా FSLకు పంపాలని యోచిస్తున్నారు.

ఎలాంటి ఆధారాలు లేవు..

పోలీసుల విచారణలు, సీసీటీవీ ఫుటేజీ విశ్లేషణలు గురుమూర్తి ఇచ్చిన వాంగ్మూలాలకు భిన్నంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. జనవరి 15న రాత్రి ఈ దంపతులు తమ ఇంట్లోకి ప్రవేశించినట్లు ఫుటేజీలో ఉంది. అయితే మాధవి ఆ తర్వాత వెళ్లిపోయినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. కానీ జనవరి 28న జరిగిన విచారణలో జనవరి 16న ఉదయం తీవ్ర వాగ్వాదం జరగడంతో తన భార్యను హత్య చేసినట్లు మూర్తి అంగీకరించాడని తెలిపారు. మొదట ఆమెను ఎలా కొట్టాడో.. ఆమె కుప్పకూలిపోయిన తర్వాత ఎలా గొంతు కోసి చంపాడో వివరించాడు. వంటగది కత్తిని ఉపయోగించి బాత్రూంలో ఆమె శరీరాన్ని ముక్కలు చేశాడు. శరీర భాగాలను వేడి నీటిలో మరిగించి, వాటిని స్టవ్‌పై కాల్చి, ఎముకలను పొడిగా చేసి, అవశేషాలను పారవేసేందుకు ప్రయత్నించాడు. కొన్ని అవశేషాలను టాయిలెట్‌లో ఫ్లష్ చేశాడు. ఈ ప్రక్రియ ఉదయం నుండి సాయంత్రం వరకు దాదాపు 10 గంటలపాటు కొనసాగిందని పోలీసులు తెలిపారు.

Also Read: ఎలన్ మస్క్‌ను రంగంలోకి దింపిన ట్రంప్.. సునీతా విలియమ్స్‌ తీసుకొచ్చే డేట్ ఫిక్స్!

ఇక నేరాన్ని దాచేందుకు డిటర్జెంట్, ఫినైల్, యాసిడ్‌ను ఉపయోగించి ఇంటిని శుభ్రం చేశాడు. రక్తం వాసన రాకుండా జాగ్రత్తపడ్డాడని ఫోరెన్సిక్ నిపుణులు బయటపెట్టారు. ఇంట్లో ఉన్న స్టవ్, కత్తి, రోలర్ రాయి, బకెట్, వాటర్ హీటర్, క్లీనింగ్ పరికరాలు, మాధవి దుస్తులతో సహా కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా అతని మొబైల్ ఫోన్లు, మోటార్ సైకిల్‌ను కూడా దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. 

Also Read: కాలిఫోర్నియా గవర్నర్ రేసులో యూఎస్ మాజీ ఉపాధ్యక్షురాలు కమలా 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు