/rtv/media/media_files/2025/10/11/9-carat-gold-2025-10-11-13-39-48.jpg)
9 carat gold
బంగారం అంటే మహిళలకు ప్రాణం. అందంగా కనిపించడానికి బంగారం ముఖ్య పాత్ర వహిస్తుంది. అయితే ఏదైనా ఫంక్షన్, పెళ్లి ఏదైనా ఉంటే తప్పకుండా బంగారం ధరిస్తారు. కానీ ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్ని తాకడంతో కొనుగోలు చేయడానికి ప్రజలు భయపడుతున్నారు. ప్రస్తుతం తులం బంగారం ధర రూ.1.40 లక్షల వరకు ఉంది. ఇంకా తులం బంగారం రూ.2 లక్షల వరకు వెళ్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే బంగారంలో 24 క్యారెట్లు, 22 క్యారెట్లు ఉన్నాయని చాలా మందికి తెలుసు. కానీ ఇవే కాకుండా 18, 20, 9 క్యారెట్ల బంగారం కూడా ఉందనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అయితే బంగారం క్యారెట్లు తగ్గే కొలది వాటితో మీరు ఐటెమ్స్ చేయించుకుంటే మాత్రమ తక్కువ బడ్జెట్‌లోనే మీకు ఆభరణాలు వచ్చేస్తాయి. కేవలం రూ.10 వేలతో మీరు బంగారం వస్తువులు తయారు చేయించుకోవచ్చు. ఎలాగో మరి ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Stock Market: డిసెంబర్7 నుంచి మారనున్న స్టాక్ మార్కెట్ ..బ్లాక్ డీల్స్ కు కొత్త రూల్స్
ఈ క్యారెట్ల బంగారంతో అద్భుతమైన నగలు..
24 క్యారెట్ల బంగారం అనేది స్వచ్ఛమైన బంగారం. ఇందులో 99.99% శాతం బంగారం ఉంటుంది. అదే 22 క్యారెట్లలో 91.60% బంగారం ఉంటుంది. మిగిలినవి ఇతర లోహాలు కలిపి తయారు చేస్తారు. 18 క్యారెట్లలో 75 శాతం బంగారం ఉంటుంది. ఇందులో 25 శాతం లోహాలు కలుపుతారు. అదే 20 క్యారెట్లలో అయితే 83.30% బంగారం, 16.70% ఇతర లోహాలు ఉంటాయి. ఎక్కువగా ఆభరణాలను 18 క్యారెట్లతో తయారు చేస్తారు. అయితే వీటిన్నింటి కంటే 9 క్యారెట్ల బంగారం ధర తక్కువగా ఉంటుంది. ఈ 9 క్యారెట్ల బంగారంతో నగలు చేయించుకుంటే డైలీ కూడా ధరించవచ్చు. అయితే ఇందులో కేవలం 37.5% మాత్రమే స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. మిగిలిన 62.5% ఇతర లోహాలు ఉంటాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1.20 లక్షలు ఉంది. అదే 9 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.40 వేలు ఉంది. అదే మీరు దీంతో నగలు చేయించుకుంటే మీరు చాలా తక్కువ ధరకే చూడటానికి అద్భుతంగా ఉంటాయి.
ఇది కూడా చూడండి: Gold ETF: అదిరిపోయే గోల్డ్ బాండ్స్.. రూపాయి పెడితే వంద రూపాయిలు.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే కోటీశ్వరులు కావడం పక్కా!
ఉదాహరణకు మీరు 2.5 నుంచి 3 గ్రాముల బరువున్న ఉంగరం లేదా చెవిపోగులు చేసుకుంటే రూ.10 వేల నుంచి రూ.12 వేలు ఖర్చు అవుతుంది. 5 గ్రాముల నగలు చేయించుకుంటే దాదాపుగా రూ.20వేలు అవుతాయి. ఇలా మీరు తక్కువ బడ్జెట్‌కే ఎక్కువగా బంగారం నగలు చేయించుకోవచ్చు. అయితే ఈ 9 క్యారెట్ల బంగారానికి హాల్‌మార్కింగ్ తప్పనిసరిగా ఉండాలని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) తెలిపింది. ఈ ఏడాది జూలై నుంచి 9 క్యారెట్ల బంగారు ఆభరణాలను హాల్‌మార్క్ లేకుండా ఎవరూ అమ్మడానికి వీల్లేదని తెలిపింది. అయితే ఈ హాల్‌మార్కింగ్ అనేది స్వచ్ఛతను తెలియజేస్తుంది. దీనివల్ల కస్టమర్లను మోసం చేసే అవకాశం పెద్దగా ఉండదు. అయితే బంగారం మీద అమితమైన ప్రేమ ఉన్నవారు ఎక్కువగా ఈ 9 క్యారెట్ల బంగారంతో నగలు చేయించుకుంటే.. బలంగా ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. అలాగే బంగారంలా మెరుస్తుందని నిపుణులు అంటున్నారు.