Medak: అంబేద్కర్ సాక్షిగా.. మతిస్థిమితం లేని మహిళపై గ్యాంగ్ రేప్!

తెలంగాణలో కామాంధుల చేతిలో మరో మహిళ బలైంది. మెదక్ జిల్లా రామంతాపూర్‌లో అంబేద్కర్ విగ్రహం అరుగుపై మతిస్థిమితం లేని మహిళపై గ్యాంగ్ రేప్ జరగడం సంచలనం రేపుతోంది. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను భరోసా సెంటర్‌కు తరలించారు. 

New Update
medak

Medak Woman Gang Raped at Ambedkar Statue

Medak: తెలంగాణలో కామాంధుల చేతిలో మరో మహిళా బలైంది. నడి బజారులో అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మతిస్థిమితం లేని మహిళపై గ్యాంగ్ రేప్ జరగడం సంచలనం రేపుతోంది. అర్ధరాత్రి మద్యం మత్తులో విచక్షణ మరిచిని దుర్మార్గులు.. ఆమె వద్దని వేడుకుంటున్న కనికరించకుండా కాటేశారు. ఒకరి తర్వాత ఒకరు మృగాళ్ల బలవంతంగా శృంగార కోరిక తీర్చుకునేందుకు దారుణానికి ఒడిగట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన మెదక్ జిల్లా మసాయి పేట మండలం రామంతాపూర్‌లో చోటుచేసుకోగా స్థానికులు, పోలీసులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. 

ఇది కూడా చదవండి: TG: ఇందిరమ్మ ఇళ్లు ఫస్ట్ వారికే.. సంక్రాంతివేళ మంత్రి పొన్నం శుభవార్త!

విగ్రహం వెనుక గద్దెపైనే దారుణం.. 

ఈ మేరకు మతిస్థిమితం లేని మహిళ రామంతాపూర్‌లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఒంటరిగా ఉంది. అయితే అటువైపుగా వెళ్తున్న ముగ్గురు పురుషులు మద్యం మత్తులో ఆమెపై లైంగిక దాడి చేశారు. విగ్రహం వెనుక గద్దెపై సాముహిత అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ విషయం అనుకోకుండా బయటపడింది.

ఇది కూడా చదవండి: తిరుమల టికెట్ల డబ్బులతో రోజాకు బెంజ్ కారు.. జేసీ సంచలన ఆరోపణలు!

వేరే మహిళ కేసులో నిందితుల కోసం రామంతపూర్ స్టేజి వద్ద హంస దాబాకు చెందిన సీసీటీవీ ఫుటేజ్ పోలీసులు పరిశీలిస్తుండగా ఇది బయటపడింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అత్యాచారానికి పాల్పడిన ముగ్గురిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. మతి స్థిమితం లేని మహిళ తన వివరాలు చెప్పలేకపోవడంతో భరోసా సెంటర్‌కు తరలించారు. 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు