/rtv/media/media_files/2025/05/02/t3XwmCJIoAfWwx5LEoRB.jpg)
Mahabubnagar Three children die while swimming
Crime: తెలంగాణలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. సమ్మర్ హాలీడేస్ సరదాగా గడపాలనుకున్న పసిబిడ్డలకు అకాల మరణం సంభవించింది. ఈత నేర్చుకునేందుకు వెళ్లిన ఇద్దరు అబ్బాయిలు, ఒక బాలిక అనుకోకుండా చనిపోవడం తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చింది. ఒకేసారి ముగ్గురు బిడ్డలను కోల్పోయిన ఆ కుటుంబం, బంధువులు, గ్రామస్థులు కన్నీటిపర్యంతమయ్యారు. గుండెలను పిండేసే ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పోతుల చెరువులో మునిగి..
నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలానికి చెందిన ఆదెర్ల ధర్మారెడ్డి కొడుకు గణేశ్(13), కూతురు రక్షిత(10) హైదరాబాద్‌లోని ఓ వసతిగృహంలో 7, 5వ తరగతి పూర్తి చేశారు. పాన్‌గల్ మండలం జమ్మాపూర్ గ్రామానికి చెందిన సుధాకర్‌గౌడ్, రాధ దంపతుల కొడుకు శ్రావణ్‌కుమార్(7) 2 తరగతి పూర్తి చేసుకున్నాడు. అయితే వేసవి సెలవులకోసం ఇంటికి వచ్చిన ఈ ముగ్గురు మరికొంతమంది పిల్లలతో పెద్దకొత్తపల్లి పోతుల చెరువు వద్దకు ఈత నేర్చుకునేందుకు వెళ్లారు.
Also Read: USA: ఎన్ఎస్ఏ సలహాదారు మైక్ వాల్జ్ పై వేటు
ఈ క్రమంలోనే చెరువులోకి దిగిన శ్రావణ్‌కుమార్ మొదటగా మునిగిపోగా.. అతన్ని కాపాడేందుకు రక్షిత, గణేశ్ నీటిలోకి దిగారు. కానీ ఈత రాక ముగ్గురు మునిగిపోయారు. మిగతా పిల్లలంతా పక్కనే పొలంలో ఉన్న గ్రామస్థులకు సమాచారం అందించగానే పరిగెత్తుకెళ్లి కాపాడేందుకు ప్రయత్నించారు. అప్పటికే ముగ్గురూ చనిపోయారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేశ్, ఎస్సై సతీశ్ తెలిపారు.
Also Read: అమెరికా రక్షణ మంత్రితో ఫోన్‌లో మాట్లాడిన కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్
children | died | swimming | telugu-news | today telugu news