/rtv/media/media_files/2025/05/02/YudwNFcitFRTLDids4sM.jpg)
MIke Waltz
అనుకున్నట్టుగానే అమెరికా జాతీయ భద్రతా సలహాదారుపై వేటు పడింది. వాల్జ్ స్థానంలో తాత్కాలిక జాతీయ భద్రతా సలహాదారుగా విదేశాంగశాఖ మంత్రి రుబియోను నియమిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. మైక్ వాల్జ్ ను ఐక్యరాజ్య పమితి రాయబారిగా ట్రంప్ నియమించారు.
సిగ్నల్ లో సమాచారం లీక్..
యెమెన్ పై అమెరికా కొన్ని రోజులుగా దాడులు చేస్తోంది. వాటికి సంబంధించిన ప్రణాళికలు ముందుగానే లీకయ్యాయి. హౌతీ తిరుగుబాటు దారులపై దాడులకు సంబంధించిన సమాచారం ముందుగానే సిగ్నల్ యాప్ చాట్ ద్వారా ఒక పాత్రికేయుడికి చేరింది. తాను అధికారులతో క్రియేట్ చేసిన గ్రూప్ లో వాల్జే పాత్రికేయుడిని చేర్చారు. అయితే అది పొరబాటుగా జరిగిందని ఆయన చెప్పారు. అందుకే దాడుల సమాచారం లీక్ అయిన తర్వాత దానికి సంబంధించిన బాధ్యత తనదేనని వాల్జ్ ప్రకటించారు. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మైక్ ను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వల్జ్ ను ఐక్యరాజ్య సమితి రాయబారిగా నియమించారు.
today-latest-news-in-telugu | usa | yemen | Houthi attacks Red Sea | america president donald trump
Also Read: Dhruv Helicopters: యుద్ధానికి సిద్ధమవుతున్న ధ్రువ్ హెలికాఫ్టర్లు