AP News: కర్నూల్ లో ఘోర రోడ్డు ప్రమాదం! ముగ్గురు స్పాట్ డెడ్

కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున ఓ కుటుంబం హైదరాబాద్ నుంచి కడప జిల్లా మైదుకూరు వెళ్తుండగా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ సమీపంలో వారి స్కార్పియో వాహనం ట్రాక్టర్ ని ఢీకొట్టింది.

New Update
Kurnool road accident

Kurnool road accident

AP News: కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున ఓ కుటుంబం హైదరాబాద్ నుంచి కడప జిల్లా మైదుకూరు వెళ్తుండగా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ సమీపంలో వారి స్కార్పియో వాహనం ట్రాక్టర్ ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయిపోగా.. అందులోని ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా  గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో ఓ  మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.  మృతులను మున్ని (35), షేక్‌ కమాల్‌ బాషా(50) , మూడేళ్ల చిన్నారి షేక్‌ నదియా గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read :  హైదరాబాద్ లో యాసిడ్, కెమికల్స్ తో పాలు.. ఆ ఎరియాల్లో అమ్మకాలు.. షాకింగ్ వీడియోలు!

Also Read :  భూవివాదంలో నటి శిల్పా చక్రవర్తి.. ఎస్సై కి నోటీసులు

మరో రోడ్డు ప్రమాదం

ఇదిలా ఉంటే ఇటీవలే ఏపీలో మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.  తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని వస్తుండగా.. భారీ ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలోని శివగావ్‌ అహ్మదానగర్‌కు చెందిన నలుగురు యువకులు శ్రీకర్, తుషార్, కార్తీక్‌, సుమిత్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకుని కారులో తిరిగి వస్తున్నారు. అలా వస్తున్న క్రమంలో మంగళవారం వేకువజామున 2గంటల దాటిన తర్వాత అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి వద్ద నేషనల్ హైవేపై కారు అదుపుతప్పింది. 

Also Read: Sir Madam Teaser: భార్యాభర్తలుగా నిత్యా మీనన్, సేతుపతి.. 'సార్ మేడమ్' టీజర్ ఉంది!

అనంతరం ఆ కారు రోడ్డుపై బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న నలుగురిలో ముగ్గురు స్పాట్‌లోనే మృతి చెందారు. శ్రీకర్, తుషార్, కార్తీక్‌ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరొక యువకుడు సుమిత్ తీవ్రంగా గాయపడగా.. అతడిని సమీపంలోని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి గురైన కారు నుజ్జునుజ్జు అయింది. 

Also Read: Oh Bhama Ayyo Rama: 'ఓ భామా అయ్యో రామా'.. స్టార్ డైరెక్టర్ల ఎంట్రీతో నవ్వులు పూయించిన ట్రైలర్!

kurnool accident news | accident | Latest News

Advertisment
Advertisment
తాజా కథనాలు