/rtv/media/media_files/2025/02/21/8oWZhPGFZrblS9mIiYq1.jpg)
జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ జానకీరామ్ రాసలీలలు బయటపడ్డాయి. తనకంటే 20 ఏళ్ల చిన్న వయసున్న ఓ అమ్మాయితో జానకీరామ్ కలిసి ఉండగా అతని భార్య కళ్యాణి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని ఇద్దర్నీ చితకబాదింది. జానకీరామ్ వారాసిగూడలో ఓ అమ్మాయితో కాపురం పెట్టాడు. ఫోన్లు ఎక్కువగా మాట్లాడుతూ ఉండటం, రాత్రుళ్లు ఇంటికి సరిగ్గా రాకపోవడంతో భర్తపై ఫోకస్ పెట్టింది కళ్యాణి. జానకీరామ్ రోజూ సికింద్రాబాద్ వారాసిగూడలో అపార్ట్మెంట్ కు వెళ్తున్నట్లుగా గుర్తించింది.
Also Read : మహా కుంభమేళా చివరి రోజు ఆకాశంలో అద్భుతం!
Also Read : మిడిల్ క్లాస్ వారికి చీప్ అండ్ బెస్ట్ స్కూటర్ అంటే ఇదే భయ్యా!
ఇద్దర్నీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని
ఓ అమ్మాయితో అక్రమసంబంధం పెట్టుకున్నట్లుగా తెలుసుకున్న కళ్యాణి శుక్రవారం ఉదయం ఇద్దర్నీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితకబాదింది. జానకీరామ్ ఎక్కడ పనిచేస్తే అక్కడ ఆఫీసులో ఉన్న అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడని అతని భార్య ఆరోపిస్తోంది. సమాచారం అందుకున్న వారాసిగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు.
జానకీరామ్ రాసలీలలు బయటపడటం ఇదేం మొదటిసారి కాదు.. గతంలో చాలా మంది మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకుని తన భార్యకు దొరికిపోవడం జానకీరామ్ కు అలవాటే.
Also read : Pulivendula: పులివెందుల పోలీసులకు కోర్టులో చుక్కెదురు!
Also Read : డ్రైవర్‌కు హార్ట్ ఎటాక్.. అదుపు తప్పిన కంటైనర్.. ఒకరు మృతి