BIG BREAKING: ఇండియాలో కరోనా కల్లోలం.. కర్ణాటకలో కోవిడ్ తొలి మరణం!

కర్ణాటకలో ఈ ఏడాదిలో తొలి కోవిడ్-19 మరణం శనివారం నమోదైంది. 85 ఏళ్ల వృద్ధుడు కోవిడ్ కారణంగా మృతి చెందినట్లు తెలుస్తోంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో వైట్‌ ఫీల్డ్‌లోని ఆసుపత్రిలో చేరి మృతి చెందాడు.

New Update
Covid new variant JN.1

Covid

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ ఏడాదిలో కర్ణాటకలో తొలి కోవిడ్-19 మరణం శనివారం నమోదైంది. 85 ఏళ్ల వృద్ధుడు కోవిడ్ కారణంగా మృతి చెందాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో వైట్‌ ఫీల్డ్‌లోని ఆసుపత్రిలో చేరి మృతి చెందాడు. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 108 మందికి కరోనా పరీక్షలు చేయగా, ఐదుగురికి వైరస్ సోకినట్లు నిర్ధారించారు. కర్ణాటకలో ప్రస్తుతం మొత్తం 38 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

ఇది కూడా చూడండి:Spirit Movie: దీపికా ఔట్.. యానిమల్ బ్యూటీ ఇన్.. ప్రభాస్‌తో రొమాన్స్‌కి బోల్డ్ బ్యూటీ

థానేలో కూడా ఓ వ్యక్తి..

అలాగే థానేలో డయాబెటిక్ కీటోయాసిడోసిస్‌తో బాధపడుతున్న 21 ఏళ్ల వ్యక్తి కూడా మృతి చెందాడు. ఇతనికి పరీక్షలు చేయగా కోవిడ్ పాజిటివ్‌ వచ్చింది. అయితే ఇతను కోవిడ్-19 కాదని.. కీటోయాసిడోసిస్‌తో ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇది కూడా చూడండి:PM Modi-CM Revanth: ఆ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వండి.. మోదీకి సీఎం రేవంత్ రిక్వెస్ట్!

ఇది కూడా చూడండి:Pregnant Woman Dies: హాస్పిటల్ సిబ్బంది తప్పుతో 2 ప్రాణాలు బలి.. ఏం జరిగిందంటే?

Advertisment
తాజా కథనాలు